“కైరా అద్వానీ” తెలుగులో మహేష్ బాబు సరసన “భారత్ అనే నేను, రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రాలలో మెరిసిన విషయం తెలిసిందే. అయితే అందులో “భరత్ అనే నేను” కాస్త పర్వాలేదు అనిపించినా, వినయ విధేయ రామ మాత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.
అయితే తాజాగా మన టాలీవుడ్ కి చెందిన ఇద్దరు నిర్మాతలు కైరాను సంప్రదించగా పారితోషకం విషయంలో వారికీ భారీ షాక్ ఇచ్చిందట. టాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేని కైరా కి అంత ముట్టచెప్పాలా అని వాపోతున్నారట నిర్మాతలు. అయితే బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలతో బిజీ ఉన్న ఈ భామని ఇప్పుడు తెలుగులో నటించమంటే ఆ మాత్రం అడగడంలో తప్పులేదులెండి. కానీ హిందీ సినిమాల్లో ఈ అమ్మడు క్రేజ్ చూసాక మాత్రం నిర్మాతలు ఈమెనే కావాలనుకుంటున్నారు. అక్కడ చిన్న హీరోల నుండి, స్టార్ హీరోల వరకు మంచి డిమాండ్ ఉంది ఈ భామకు. అందుకే ఈ భామ సౌత్ లో కూడా భారీగా డిమాండ్ చేస్తోందట.
ఇప్పటికే తెలుగులో వరుణ్ తేజ్ సినిమా కోసం, రామ్ చరణ్ సినిమా కోసం కైరాను సంప్రదిస్తే 5 కోట్లు డిమాండ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. 5 కోట్లు ఇస్తే కాల్షీట్లు అడ్జస్ట్ చేస్తాను అని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఆమె మాటలకూ షాక్ తిన్న నిర్మాతలు చేసేదేమిలేక పూజ, రష్మిక లతో సర్దుకుపోదాం అని భావిస్తున్నారట.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన…
అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…
టాలీవుడ్‌లో మహిళా సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న వేధింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యాంకర్‌లు, నటీమణులు అనసూయ…
వేసవి వేడిలో చల్లని తీపి రుచిగా అందరినీ ఆకట్టుకునే ఐస్‌క్రీమ్ గురించి కొత్త కోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సుహాసిని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నో సూపర్…
ఇటీవలి కాలంలో ఇంటి అలంకరణలో భాగంగా మనీ ప్లాంట్ మొక్కకు ప్రత్యేక స్థానం దక్కింది. చాలా మంది ఈ మొక్కను…