కరోనా నిబంధనలు ఉల్లంఘించిన పెళ్లి వేడుకను నిలిపివేశారు అధికారులు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, మంగళూరు ప్రాంతంలోని మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో జరిగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో అతిథులు పెళ్లికి హాజరయ్యారు.

కాగా.. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ నేతృత్వంలో మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ బృందం అక్కడకు చేరుకుని వివాహ వేడుకను నిలిపివేసింది. ఒకే రోజు నాలుగు పెళ్లిళ్లకు ఆలయ అధికారులు అనుమతిచ్చారని, దీనిపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ మదన్ మోహన్ తెలిపారు.



























