ఏడూ కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నిత్యం ఆ తిరుమలకి కొన్ని లక్షలమంది భక్తులు ఆ స్వామిని దర్శించేందుకు వెళ్తూ ఉంటారు. ధనాన్ని ఇచ్చే ఆ మహాలక్ష్మి భర్త అయిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు లక్ష్మీదేవితో కలసి అక్కడ కొలువై ఉన్నారని అంటారు. అందుకే ఇన్నేళ్ళు అయినా కూడా రోజురోజుకి భక్తులు ఆ తండ్రిని దర్శించేందుకు వెళ్తూనే ఉన్నారు.
విష్ణుమూర్తి మీద అలిగి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ, ఆ మహావిష్ణువు సామాన్యుడివలె, ఎన్ని కష్టాలు పెడ్డారో, మన పురాణాలలో మనం చదివాము. ఆ తరవాత పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ఆయన అప్పు చేయడం, ఆ అప్పు కు వడ్డీని, ఇప్పటికీ కుబేరుడికి ఇస్తూ ఉండటం, భక్తులు ఎంతో ప్రేమతో, భక్తితో ఇస్తున్న కానుకులను కుబేరుడికి వడ్డీ రూపంలో చెల్లించడం, నిజంగా ఇందులో మానవులు నేర్చుకోవలసిన ఎంతో నీతి ఉంటుంది. కలియుగంలో తలవగానే, కోలువగానే ఆదుకునే ఆపద్భాందవుడు ఆ వేంకటేశ్వరుడు. ఆయన మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల ఒకరోజు తిరుమలలో కుంబ వర్షం కురిసిందట. గత కొంతకాలంగా తిరుమలలో ప్రజలు నీళ్ళకు కరువు చూస్తున్నారని ఆ వేంకటేశ్వరుడు తెలుసుకుని, ఇలా వర్షం కురిపించాడని భక్తులు అనుకున్నారు.
అంతేకాకుండా ఆరోజు తిరుమలలో ఆ సమయంలో శ్రీవారి విగ్రహం కళ్ళు తెరిచిందని కొందరు భక్తులు అంటున్నారు. అది చూసిన వారు ఆనందంతో, ఏడుకొండలవాడా గోవిందా గోవిందా అంటూ తన్మయత్నంలో మునిగిపోయారంట. మనం కూడా ఈరోజు ఆ స్వామిని తలచుకుని, ఒక్కసారి తిరుమలలో శ్రీవారి విగ్రహాన్ని గుర్తుచేసుకుని తరిద్దాం…


































