ఒక సినిమా హిట్ అయ్యేంత వరకే హీరోయిన్స్ కాస్త నిదానంగా ఉంటారు. హిందీలో గానీ, తెలుగులో గానీ, తమిళంలో గానీ ఓ భారీ హిట్ పడిందా..ఇక నిర్మాతలకి చుక్కలే కనిపిస్తాయి. మొదటి సినిమాకి రెమ్యునరేషన్ ఎంత కావాలి అంటే మీరెంతిచ్చినా పర్లేదు సార్. నాకు మీ సినిమాలో అవకశామ రావడమే ముఖ్యం అని చిలక పలుకులు పలుకుతారు. డెబ్యూ సినిమా హిట్ అయితే మాత్రం అదే నిర్మాత మరో సినిమా చేయమంటే నాకు ఇప్పటికే ఆ నిర్మాతలు అంతిస్తామంటున్నారు..హిందీలో ఆఫర్ వచ్చింది. డేట్స్ చూడాలి అని నిచ్చెన ఎక్కడం మొదలు పెడతారు. ఎప్పుడు ఏ హీరోయిన్ కెరీర్ అర్థాంతరంగా రెండు ఫ్లాపులతో క్లోజ్ అవుతుందో తెలీదు. అందుకే ముందుగానే జాగ్రత్త పడుతుంటారు. ఇప్పుడు కియారా అద్వానీ కూడా అదే చేస్తోందట.
కియారా అద్వానీ 2016 లో వచ్చిన ఎంఎస్ ధోని సినిమాతో హీరోయిన్ గా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాకి ముందు కియారా అవకాశాల కోసం చాలానే స్టగుల్ అయ్యింది. అయితే ధోనీ సినిమా తన ఫేట్ మార్చేసింది. హిందీలో చేసిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు లో మహేష్ బాబుతో నటించిన మొదటి సినిమా భరత్ అనే నేను విపరీతమైన పాపులారిటీని తీసుకు వచ్చాయి. భరత్ అనే నేను సినిమా కు కియారా రెమ్యునరేషన్ 75 లక్షల వరకు తీసుకుంది.
అయితే ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లో చేసిన కబీర్ సింగ్ సినిమాతో వరుస సినిమాలు కమిటయి బిజీగా అయింది. అయితే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించేందుకు కియారాకు కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు అని అప్పట్లో టాక్ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ తెలుగులో నటించేంత సమయం దొరకలేదు. బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతోనే గడుపుతోంది. దాంతో అక్కడ ఈమె రెమ్యునరేషన్ కూడా 2 నుంచి 3 కోట్లకి చేరింది. ఆ మధ్య ఓ తెలుగు సినిమాకి సంప్రదిస్తే కూడా చుక్కలు లెక్కపెట్టుకునే రెమ్యునరేషన్ చెప్పిందట.
అయితే ఇప్పుడు క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పాన్ ఇండియన్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు. రీసెంట్ గా చరణ్ – శంకర్ సినిమాలో కియారా నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇస్తూ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కాగా ఈ సినిమాలో నటిస్తున్నందుకు శంకర్ – దిల్ రాజు కియారాకు దాదాపుగా రూ. 5 కోట్లను రెమ్యునరేషన్ గా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
చరణ్ కెరీర్ లో 15వ సినిమా. అలాగే దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి 50 వ సినిమా. ఇలా అటు చరణ్ ఇటు దిల్ రాజుకి మైల్ స్టోన్ మూవీ కాబట్టి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక చరణ్ కి బాలీవుడ్ మార్కెట్ మీద మంచి పట్టుంది. శంకర్ సినిమాతో దాన్నీ బాగా పెంచుకోవాలనుకుంటున్నాడు. సౌత్ లోని అన్నీ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది. అందుకే కియారా అద్వానీని తీసుకున్నారు. తను కూడా ఈ ప్రాజెక్ట్ కి ఉన్న వెయిట్ చూసే రూ. 5 కోట్లను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…