బ్యాంకు ఉద్యోగుల సెలవుల విషయంలో ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకులలో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రతి సంవత్సరం సెలవులు తప్పని సరిగా ఇవ్వాలంటూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అన్ని బ్యాంకులను ఆదేశించింది.

ఈ క్రమంలో ఉద్యోగులకు 10 రోజులకు తక్కువ కాకుండా సెలవులు ఇవ్వాలని సూచించింది. అదే విధంగా సెలవులో ఉన్న ఉద్యోగులకు బ్యాంకు ఉద్యోగ సంబంధిత బాధ్యతలకు సంబంధించి ఎటువంటి సమాచారం అందించవద్దని కూడా ఆర్బీఐ ఈ సందర్బంగా తెలిపింది. కొత్తగా సవరించిన రిస్క్ మేనేజ్మెంట్ మార్గదర్శకాల్లో భాగంగా RBI శుక్రవారం రోజున ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అయితే.. బ్యాంకుల కార్పొరేట్ ఈ-మెయిల్స్ మరియు అంతర్గత వ్యవహారాలపై ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.






























