అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం ఇది జైళ్లలోని ఖైదీలకు కూడా తాకింది. చాలా మంది ఖైదీలు కరోనా బారినపడుతున్నారు. అమెరికా మొత్తం మీద వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలు రెండు వేల మందికి కరోనా సోకింది. లక్షణాలున్న మొత్తం 2700 మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో రెండువేల మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది. దీనిపై అమెరికాలోని ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని వివిధ జైళ్లల్లో సుమారు ఒక లక్ష యాభై వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు వీరందరి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కరోనా సోకిన ఖైదీలపట్ల పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కరోనా సోకిన ఖైదీల సమాచారం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఫెడరల్ బ్యూరో మాత్రం ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి కంటే జైళ్లలో కరోనా పరిస్థితులు బాగున్నాయని చెబుతున్నారు.


































