డిస్కౌంట్ అంటే చాలు జనాలు ఎన్ని పనులున్నా సరే ఆ షాపు వద్ద క్యూ కట్టాల్సిందే. ఏదైనా షాపు వెళ్ళినప్పుడు అది తక్కువధరకు వస్తుందా అని మాత్రమే చూస్తాం తప్ప అసలు ఎందుకు అంత తక్కువకి వస్తుంది అని ఎవరు ఆలోచించరు. అయితే ఇక్కడ మాత్రం ఈ షాపు వాళ్ళు చేసిన పొరపాటుకు పెద్ద రచ్చే జరిగింది. అయితే ఇది మన దేశంలో కాదులెండి. ప్రాన్స్ లో జరిగింది ఈ సంఘంటన.
ఫ్రాన్స్ లో ని జెయింట్ క్యాసినో అనే రిటైల్ స్టోర్ ఇటీవల టీవీలపై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి జనాలు భారీ ఎత్తున క్యూ కట్టారు. కాస్టమర్ల రద్దీ భారీగా పెరిగిపోవడంతో కంట్రోల్ చేయడం షాపు యజమాన్యం వాళ్ళ కాలేదు. పెద్ద గొడవ జరిగింది.
అసలు విషయం ఏమిటంటే షాపు ముద్రించిన ప్రకటన లో టీవీ ధర 30.99 యూరోలుగా ముద్రించింది. దీని అసలు ధర 399 యూరోలు. ఇదే మన కరెన్సీలో అయితే అక్షరాలా 31,500 రూపాయిలు. ప్రకటించింది మాత్రం 2,450 రూపాయిలు. ఈ స్టోర్ ఇచ్చిన డిస్కౌంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దీనితో ఆ షాపు వద్ద కస్టమర్లు బారులు తీరారు. ఒకొక్కరు నాలుగైదు టీవీలను ట్రాలీ లో వేసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న షాపు యాజమాన్యం అసలు విషయం తెలిసి షాక్ అవ్వడం వారి వంతు అయింది.
అయితే ఇచ్చిన అడ్వేర్టైస్మెంట్ పొరపాటు జరిగిందని, టీవీలపై అంత డిస్కౌంట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఎదో అనుకోకుండా పొరపాటు జరిగిందని చెప్పుకొచ్చింది. దీంతో కస్టమర్లు షాపు యాజమాన్యంపై పెద్ద ఎత్తున వీరంగం సృష్టించారు. టీవీలు డిస్కౌంట్ తో ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదని, ఆగ్రహంతో రచ్చ రచ్చ చేసారు. దీనితో చేసేది ఏమి లేక యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి కస్టమర్లను అతికష్టం మీద వెనక్కి పంపించారు. షాపు వారు చేసిన చిన్న తప్పుకి రచ్చ రచ్చ జరిగింది.



























