AP News: ప్రస్తుత కాలంలో రోజురోజుకు మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది. మోసేపోయేవారు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు రోజురోజుకు మోసాల సంఖ్య అధికమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఒకటి బయటపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శరణ్య అనే ఓ మహిళకు 54 సంవత్సరాలు. అయితే ఈమె మేకప్ వేసి వయస్సు బయటకు కనపడకుండా బాగా కవర్ చేశారు.ఇలా మేకప్ తో తనకు 30 సంవత్సరాలేనని చెబుతూ ఈమె 35 ఏళ్ల యువకుడిని వివాహం ఆడింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన అసలు నాటకం బయటపెట్టింది.
ఆ యువకుడి పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం తన పేరుకు మార్చాలంటూ ప్రతిరోజు ఆ యువకుడిని వేధింపులకు గురి చేసేది. ఈ విధంగా ఆ మహిళ టార్చర్ భరించలేక ఆ యువకుడు ఆస్తి తన పేరుపై మార్చడానికి తన ఆధార్ కార్డు తీసుకున్నారు.అయితే ఆధార్ కార్డులో ఆమె వయసుతో పాటు ఆమె మొదటి భర్తకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు.
ఈ విధంగా తనకు ముందుగానే పెళ్లి జరిగిందని అంతేకాకుండా తన వయసు 55 సంవత్సరాలని తెలియడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కంగుతున్నాడు. ఈ విధంగా శరణ్య తనని మోసం చేయడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ యువతకి వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉండడమే కాకుండా వారికి కూడా వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ఆ యువకుడితో శరణ్యకు ఇది రెండవ వివాహం కాదు మూడవ వివాహం అని తెలియడంతో ఆ యువకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…