6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యం.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ హెచ్చరిక

0
125

కరోనా థర్డ్‌ వేవ్‌ పై కీలక హేచరికలు చేసారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ రావడం అనివార్యమని అయన అన్నారు. అయితే రాబోయే 6 నుంచి 8 వారాల్లో థర్డ్‌ వేవ్‌ సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కోవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలని, అదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లో జనాలు గుమికూడ కుండా ఉండటం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలని అయన అన్నారు. అయితే ఇవన్నీ ప్రజలు ఏమేరకు అవలంభిస్తారనే దానిపై మన దేశంలో థర్డ్‌ వేవ్‌ రాక ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

‘ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడం వాల్ల మన దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ మరియూ కర్ఫ్యూ నిబంధనలను సడలిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా తగ్గిపోయిందనుకుని ప్రజలు బయటికి రావడం మరియూ కోవిడ్‌ సంబంధిత నిబంధనలను పాటించకపోవడం, ఒకే దగ్గర గుమిగూడడం, వీటితో పాటూ ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌ నుంచి ప్రజలు ఏమీ నేర్చుకున్నట్లు లేదు’ అని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here