Viral Video: తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయి అనే సామెత గురించి మన అందరికీ తెలిసిందే. అయితే ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం తింటే లక్షలు సంపాదించవచ్చు అనేది నేటి మాట.ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవును కేవలం భోజనం చేస్తూ 8.5 లక్షలు సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని హోటల్ యజమానులు కల్పిస్తున్నారు.

కస్టమర్లను ఆకర్షించడానికి కోసం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క హోటళ్లు రెస్టారెంట్లు ఎన్నో ఆఫర్లను ప్రకటించడం మనం చూస్తున్నాము. తాజాగా ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ ను ఢిల్లీకి చెందిన ఒక రెస్టారెంట్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో వడ్డించే థాలీని 30 నిమిషాల్లో తింటే చాలు ఏకంగా 8.5 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ థాలీని ‘ఐరన్ మ్యాన్ థాలీ’ అని పిలుస్తారు. తాజాగా @yumyumindia అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో భారీ ఐరన్ మ్యాన్ థాలీలో వడ్డించిన వంటకాలను మనం గమనించవచ్చు. @yumyumindia ఫుడ్ బ్లాగర్ అకౌంట్ ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఈ థాలీని అరగంటలో ఇద్దరు వ్యక్తులు పూర్తి చేసి 8.5 లక్షలను సొంతం చేసుకోవచ్చు.ఈ థాలీని ఢిల్లీలోని ఆర్డోర్ 2.1 రెస్టారెంట్ వడ్డిస్తోంది.
30 నిమిషాల్లో పూర్తి చేయడం కష్టం…
ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు ఆహార పదార్థాలను ఇద్దరు వ్యక్తులు కలిపి ముప్పై నిమిషాలలో తినడం అసాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా తినడం కష్టం కనుక రెస్టారెంట్ యజమానులు ఈ విధమైనటువంటి చాలెంజ్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాలలోనే వైరల్ గా మారింది.





























