Hyper Aadi Marriage: తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ బుల్లితెర సెన్సేషన్ .. ఏమాత్రం వీలు దొరికినా సినిమాల్లోనూ నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తూ వస్తున్నాడు.
అయితే ఇతడి పెళ్లి గురించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆది పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని.. పలానా జిల్లాకు అల్లుడు కాబోతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతుండటాన్ని మనం చదువుతూనే ఉంటాం.
కానీ అవన్నీ వట్టి పుకార్లే అని ఆది చాలాసార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఈ సారి ఆది తండ్రినే ఆది పెళ్లి గురించి ఓ మాట జారాడు. అదేంటంటే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఈటీవీలో ‘పెళ్లాం వద్దు పార్టీ ముద్దు’ అనే ఈవెంట్ జరిగింది. దీనికి కమెడియన్స్ వాళ్ల తండ్రులతో హాజరయ్యారు.
అందులో భాగంగానే హైపర్ ఆది కూడా తన తండ్రిని.. వాళ్ల అన్నయ్యలను ఈ ప్రాగ్రాంకు తీసుకొచ్చాడు. ఈ ఈవెంట్‌కు రాంగోపాల్ వర్మ స్పెషల్ గెస్టుగా రాగా.. ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇక్కడ ముందుగా అతడు.. తన తడ్రి, సోదరుల గురించి చెప్పుకొచ్చాడు. ఆది ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తండ్రి అంటూ చెప్పాడు.తర్వాత ఆది యొక్క గొప్పతనం గురించి సోదరులు, అతడి తండ్రి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా.. ఆదికి పెళ్లి ఎప్పుడు చేస్తారు.. పెళ్లి గురించి వివరాలను చెప్పండి అంటూ ఇంద్రజ ఆది తండ్రిని అడుగుతుంది. ఇటీవల ఒంగోలు ఓ అమ్మాయిని చూశామన్నారు. దానిని అతడికి చెబితే.. రెండేళ్ల తర్వత చేసుకుంటా అని అన్నాడన్నారు. అంటే అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదనేగా మేడం అంటూ అన్నాడు.
ఆ సమయంలోనే ఎటువంటి అమ్మాయి కోడలిగా కావాలని ఇంద్రజ అడిగగా.. విష్ణు లేచి నిలబడు అంటూ విష్ణు ప్రియను మధ్యలో లాగాడు ఆటో రాంప్రసాద్. వెంటనే ఆది తండ్రి ఏవేవో చేసే అమ్మాయి కాదు మా ఇంటి పరువు నిలేబెట్టే అమ్మాయి కావాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇలా హైపర్ ఆది పెళ్లి గురించి ఏకంగా తన తండ్రి నోరు చేరడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…