Aata Srividya : ఈటీవీలో వచ్చే పోపులపెట్టే సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయి ఆతరువాత ఈటీవీ సీరియల్ సంఘర్షణ లో ధరణి గా నటించిన శ్రీవిద్య అందరికి సుపరిచితురాలే. ఇక ఆట ప్రోగ్రామ్ తో మరింత పాపులర్ అయిన శ్రీ విద్య కెరీర్ బాగా ఉన్నా సమయంలోనే పెళ్లి చేసుకుని టీవీ కి దూరమయ్యారు. చాలా రోజుల తరువాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న శ్రీ విద్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.
బాబు పుట్టి చనిపోయాక…..

కెరీర్ బాగున్న సమయంలోనే ప్రస్తుతం రైటర్, డైరెక్టర్ గా ఉన్న వక్కంతం వంశీని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు శ్రీవిద్య. పెళ్లి తరువాత టీవీ కి దూరమైన శ్రీ విద్య 2010 లో ఒక బాబు పుట్టగా ఆ బాబు పుట్టిన వెంటనే చనిపోవడం వల్ల చాలా క్రుంగిపోయానంటూ చెప్పారు. ఇక మళ్ళీ ఒక పాప, ఒక బాబు పుట్టిన తరువాత బాగా లావుగా తయారవడం తో ఇక పాప పుట్టినపుడు డయాబేటిస్ రావడం తో సర్జరీ సహాయంతో సన్నగా మారినట్లు తెలిపారు శ్రీవిద్య.

పిల్లలంటే చాలా ఇష్టం ఉండటం ముగ్గురు పిల్లలు కావాలని అనుకున్నారట. అయితే కరోనా సమయంలో పుట్టిన పాప పుట్టగానే నాలుగు నిమిషాలకు మరణిండంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ చెప్పారు శ్రీవిధ్య. ఇక తన భర్త తనకు ప్రతి విషయంలో ఎంతోమంది సపోర్ట్ ఇస్తారంటూ చెప్పిన శ్రీవిధ్య మళ్ళీ టీవీ రంగంలోకి వస్తానంటూ చెప్పారు.































