Acharya intresting issue : ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి మల్టీ స్టార్రర్ లో నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో చిరు సరసన కాజల్, రం చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే నక్సలైట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించారు, మణి శర్మ సంగీతం అందించగా సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పాడి చివరకు ఇపుడు విడుదలవుతోంది. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్, చిరంజీవి.

చిరు, మహేష్ కాంబినేషన్ మిస్ అయ్యామా….
ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్నీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ల్లో చెప్పారు రామ్ చరణ్. కొరటాల ఈ సినిమా చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ గానే కథ రాసుకున్నారంట. అయితే రామ్ చరణ్ అప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తుండడంతో ఈ సినిమాలో షూటింగ్ కి రాజమౌళి అనుమతి ఇస్తాడో లేదో అనే టెన్షన్ పడ్డారట రాజమౌళి తన సినిమాలో నటించే హీరోలు వేరే సినిమాలు చేయడానికి ఒప్పుకోరు వాల్ల లుక్ మారిపోతుందని లేక తెలిసిపోతుందని ఆయన జాగ్రత్తపడుతారట.
ఈ విషయంలో కొరటాల చరణ్ ఇద్దరు బాగా టెన్షన్ పడటంతో చిరంజీవి గారే స్వయంగా రాజమౌళి గారిని అడిగారట. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలనేది సురేఖ గారి కోరిక. అందుకోసమే ఈ సినిమా లో చరణ్ చేయాలని పట్టుబాట్టారట ఇక రాజమౌళితో ఇదే విషయాన్నీ చెప్పి ఒప్పించారాట చిరంజీవి. ఇక ఒక వేళ రాజమౌళి ఒప్పుకోక పోతే పరిస్థితి ఏంటని కొరటాల ఆలోచించారట ఇదే విషయాన్నీ మహేష్ బాబు గారితో చెప్పి టెన్షన్ పడ్డారట అయితే మహేష్ ఒకవేళ అలా జరిగితే నేను సినిమాలో చేస్తాను టెన్షన్ పడొద్దు అని భరోసా ఇచ్చారట. అప్పట్లో మహేష్, చిరు కాంబినేషన్ లో కొరటాల సినిమా అంటూ పుకార్లు ఇందుకే వచ్చినట్టున్నాయి.





























