Actor Bharath Reddy : డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు అంటూ కొంతమందిని అంటూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం డాక్టర్ అయి ఆ తరువాత యాక్టర్ అయ్యాడు. అలా అని తన వైద్య వృత్తిని వదిలేయలేదు. అటు డాక్టర్ గా సేవలందిస్తూనే మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అతను మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి. చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండే భరత్ రెడ్డి నిజానికి డాక్టర్ అని చాలా మందికి తెలియదు. వెంకటేష్ గారి సినిమా ‘ఈనాడు’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న భరత్ రెడ్డి ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు.

నాగార్జున నీకు అవసరమా అన్నారు…
భరత్ రెడ్డి గారు వైద్య వృత్తిని అభ్యసిస్తూనే మరోవైపు ఎంతో ఇష్టమైన నటన వైపు అడుగులేశారు. మొదటగా తేజ గారి హస్తవాసి మంచిది అని ఆయన సినిమా ‘ఒక వి చిత్రం’ సినిమాలో చిన్న రోల్ చేశారు. ఆ తరువాత అగ్ర హీరోలందరి సినిమాల్లోనూ నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన భరత్ రెడ్డి గారు నాగార్జున గారితో ఎక్కువ సినిమాల్లో నటించారు. అయితే మొదట్లో సినిమాల్లో భరత్ తో కలిసి నటించినపుడు నాగార్జున గారు నీకు అవసరమా సినిమాలు డాక్టర్ గా పనిచేస్తూ అని అన్నారట. ఆ తరువాత ఆయనే ఎన్నో సినిమాల్లో భరత్ రెడ్డిని రికమెండ్ చేశారట.

బాలకృష్ణ గారిని చూసి నేర్చుకోవాలి…
ఇక భరత్ గారు మరో అగ్ర హీరో బాలకృష్ణ గారి గురించి ఆయన అనుభవాలను తెలిపారు. కథనాయకుడు, మహానాయకుడు రెండు సినిమాల్లోను నటించారు భరత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ అల్లుడిగా పురందేశ్వరి భర్త క్యారెక్టర్ లో నటించిన భరత్ గారి నటన తొలి షెడ్యూల్ చూసి క్రిష్ అలాగే బాలకృష్ణ ఇద్దరూ మెచ్చుకున్నారట. బాలకృష్ణ గారు చాలా క్రమశిక్షణతో ఉంటారని ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆయన దగ్గరే నేర్చుకోవాలి. డైరెక్టర్ ఒక సీన్ చెప్పాక ఆయన అది ఎలా ఉన్నా నటిస్తారు ఇతరుల పనిలో వెలుపెట్టారు. అంత ఇమేజ్ ఉన్న హీరో అయినా కూడా డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తారు. అలాంటి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి వారు కెరీర్ లో అంత సక్సెస్ అయ్యారు అంటూ భరత్ రెడ్డి తెలిపారు.

































