Actor Dil Ramesh : చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో అగ్ర హీరో రేంజ్ కి ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితంలో అనుకోకుండా చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ అవ్వడం, ఆ తరువాత ఆది క్యాన్సిల్ అవడం ఇవన్నీ ఒకెత్తయితే ఇక మెల్లగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయి కెరీర్ డౌన్ ఫాల్ మొదలై సినిమాలు లేక ఖాళీగా ఉండలేక డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఆయన మరణానికి ఆర్థిక కారణాలు కారణం అంటూ వార్తలు వినిపించాయి. ఇక అసలు ఉదయ్ చనిపోడానికి కారణం డబ్బు కాదు అంటూ ఆయనతో పనిచేసిన దిల్ రమేష్ అభిప్రాయపడ్డారు.

అప్పట్లో కోటి రెమ్యూనరేషన్ తీసుకునేవాడు ఉదయ్…
ఉదయకిరణ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి హిట్లందుకుని చిన్న వయసులోనే స్టార్ హీరో అయిపోయాడు. అప్పట్లోనే కోటి దాకా రెమ్యూనరేషన్ తీసుకునేవాడు అంటూ పలు చిత్రాల్లో విలంగాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేస్తున్న దిల్ రమేష్ గారు చెప్పారు. ఉదయ్ తో ‘నువ్వు నేను’ వంటి సినిమాల్లో పనిచేసిన దిల్ రమేష్ గారు అతని గురించి చెబుతూ చాలా ఫ్రెండ్లీ గా ఉండేవాడు, ఎటువంటి స్టార్ డమ్ లేని సమయం అదీకాక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావడం వల్ల అందరితో సాధారంగా ఉండేవాడు.

ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్ళీ నెక్ట్ సినిమాలకు తన రేంజ్ పెరిగినా అలానే ఉండేవాడు. కానీ చిన్న వయసులోనే అంత సక్సెస్ చూడటం, ఆ తరువాత వరుస ఫ్లాప్ లతో స్ట్రెస్ కి గురయ్యాడు. నిజానికి ఇప్పుడున్న యువతరం అలానే ఉన్నారు సక్సెస్ ను అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నారు, ఫెయిల్యూర్స్ ని తీసుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధిచిన వాళ్ళు ఇలాంటి ఒత్తిడికి ఎక్కువ లోనవుతున్నారు. ఉదయ్ కూడా అలాంటి ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఆర్థికకారణాలతో కాదు అంటూ చెప్పారు దిల్ రమేష్.

































