Actor Goparaju Ramana : నాటకాలతో మొదలైన కెరీర్ సీరియల్స్ అలాగే నాటికలు చివరికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న గోపరాజు రమణ గారు తెనాలికి చెందినవారు. ఆయన తన పదిహేనవ ఏట నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. అక్కినేని గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆపై ఎన్నో నాటకాల్లో నటించిన ఆయన పరుచూరి బ్రదర్స్ దగ్గర నుండి ఎన్నో బహుమతులను గెలుచుకున్నారు. ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మరోసారి మంచి పేరు తెచ్చుకున్నారు రమణ గారు. అయితే చాలా సినిమాల్లో అవకాశాలు ఎలా మిస్ అయ్యాయి అన్న విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు రమణ.

అందుకే ఎక్కువ రెమ్యూనరేషన్…
గోపరాజు రమణ గారు చాలా సినిమాల్లో నటిస్తూ మరికొన్ని మంచి సినిమాల్లో అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిన విషయాలను గురించి చెబుతూ రెమ్యూనరేషన్ విషయం కారణంగా కంటే కూడా లాక్ డౌన్ వల్ల చాలా సినిమాలు నిలిచిపోయి అలా సినిమాలు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడి ముందుగా కమిట్ అయినవి చేయాల్సిన వచ్చింది. అంటే సుందరానికి వంటి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది అంటూ తెలిపారు. ఇక తన ఇంట్లో పరిస్థితుల కారణంగా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గడం లేదని చెప్పారు.

తన మనవడికి గుండె సమస్య ఉండటం వాళ్ల పుట్టినప్పటి నుండి హాస్పిటల్స్ తిరగాల్సి వచ్చింది. తనకు పుట్టినపుడే గుండె గదులు ఏర్పడక పోవడం వల్ల ఏ నిమిషంలో మరణిస్తాడో చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. అతని చికిత్స కోసం చాలా ఖర్చు చేయాల్సిన వచ్చింది. నా ఇద్దరు కొడుకులు నేను డబ్బు కోసం చాలా కష్టపడ్డాము అంటూ అందుకే ఉన్న అవకాశాలను వదులుకోకుండా చేస్తునాన్నని చెప్పారు. ప్రస్తుతం మనవడు బాగానే ఉన్నా ఇంకా చికిత్స చేయించాల్సి ఉందని తెలిపారు.