Actor Jogi Naidu : నా కూతురు విషయంలో చాలా బాధపడ్డాను… కోర్టు గంట టైం ఇచ్చేది… ఆ గంట నా కూతురితో ఏం మాట్లాడాలి…: జోగి నాయుడు

0
139

Actor Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేstuనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లి, విడాకుల వల్ల పిల్లలు ఇబ్బందుల్లో పడుతారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

నా కూతురితో ఏం మాట్లాడాలో తెలియలేదు…

జోగి నాయుడు, యాంకర్ ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ తరువాత మనస్పర్తల కారణంగా విడిపోయారు. అయితే ఎనిమీదేళ్లకు వారికి విడాకులు రాగా విడిపోవడం నాకు ఇష్టం లేదంటూ జోగి నాయుడు ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే భార్య భర్తలు డివోర్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడతారని మేము విడాకులు తీసుకున్న సమయంలో పాప తన వద్దే ఉండగా కోర్ట్ వారంలో ఒక గంట పాప నా వద్ద ఉండొచ్చు అనే అనుమతి ఇచ్చింది. ఆ గంట ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అని నరకం చూసాను.

నా కూతురికి ఎన్నో నేర్పించాలి అనికునేవాడిని. పిల్లలు ఆ ఏజ్ లో నేర్చుకున్నవి లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. కానీ ఆ గంట సమయంలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. పాప కూడా వెళ్ళేటపుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది ఆ వయసులో తాను చూడాల్సిన పరిస్థితులు కావు అంటూ తెలిపారు. ఇక తనని చూడటం కోసమని ఝాన్సీ ఇంటికి దగ్గర్లోనే ఒక ఇల్లు తీసుకుని అక్కడే కొన్నేళ్లు ఉండి పాపను చూసేవాడిని కానీ కొన్నేళ్లకు అలా ఉండటం నరకంలాగా అనిపించింది. బయటపడాలని అనుకున్నాను అంటూ చెప్పారు. ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకున్న ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.