Featured

Actor Josh Ravi : ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో భోజనం చేస్తుంటే నన్ను పక్కకి పోయి తినమని అవమానించారు…: నటుడు జోష్ రవి

Actor Josh Ravi : తెలుగులో చిన్నగా సినిమాల్లో తన ప్రయాణం మొదలుపెట్టిన రవి, నాగచైతన్య జోష్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, జోష్ రవి గా తన పేరు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో కమెడియన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను చేసిన జోష్ రవి అమ్మ నాన్న తరువాత నాకు దైవం చిరంజీవి గారు అంటు చెప్తాడు. మా టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం చిరంజీవి గారిని అనుకరించడం ఆయన సమక్షంలో అవన్నీ చేయడం మరచిపోలేనిది అంటూ చెప్పే రవి ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

ఖలేజా సినిమా టైంలో అవమానించారు…

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా వచ్చిన సినిమా ఖలేజా. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా సినిమా టీవీలో మాత్రం మంచి రేటింగ్స్ అందుకుంటుంది. ఆ సినిమాలో చేసే సమయంలో తనకు ఎదురైన అనుభవాలను రవి పంచుకున్నారు. త్రివిక్రమ్ అనగానే ఆయన డైలాగులకు ఫేమస్. ఆలాంటి ఆయన తన సినిమా క్లైమాక్స్ డైలాగ్ ను జోష్ రవికి మొదట వినిపించి ఎలా ఉందో చెప్పమన్నారట.

ఇప్పటికీ ఆ సినిమాలో ఆ డైలాగ్ విన్నపుడు చాలా ఆనందంగా ఉంటుంది అంటూ చెప్పిన ఆయన అక్కడ షూటింగ్ లో తింటుంటే ప్రొడక్షన్ వాళ్ళు పక్కకి పోయి తిను ఇక్కడ కాదు అంటూ చెప్పారు, అపుడు కొంచం బాధ అనిపించింది. మనకు డైరెక్టర్లు పరిచయం ఉన్నా అవకాశాలు ఉన్నా మన స్థాయి మనకు గౌరవం తెస్తుంది అందుకే ఆది ఆ ప్రొడక్షన్ వాళ్ళ తప్పు కూడా కాదు అని అంటాను. మనకంటూ ఒక గుర్తింపు ఉంటే ఇలా అవ్వదు అనిపిస్తుంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago