Actor Kantharao Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాలల్లో ప్రసిద్ధి చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన అయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన గురించి కుటుంబ విషయాలను కూతురు సుశీల రావు పంచుకున్నారు.

నటి మాధవిని ఇండస్ట్రీ కి తెచ్చింది మా నాన్న…
కాంతారావు గారు ఒకసారి హైదరాబాద్ గండిపేట లో షూటింగ్ లో ఉన్నపుడు అక్కడికి షూటింగ్ చూడటానికి వచ్చిన మాధవిని చూసి కళ్ళు చాలా బాగా ఉన్నాయి మేకప్ టెస్టు చేసి ఫోటోలు తీయించి పంపండి అని చెబితే ఫొటోస్ తీసి మద్రాస్ పంపారట. ఇక ఆ ఫొటోస్ ను కొంతమంది సినిమా వాళ్లకు చూపించగా అలా మాధవి ‘తూర్పు పడమర’ సినిమాకు సెలెక్ట్ అయింది.

ఈ విషయాలను చెబుతూ కాంతారావు గారి అమ్మాయి సుశీల గారు మాధవి అసలు పేరు విజయలక్ష్మి అని చెన్నై కి సినిమాల కోసం వస్తే మా అయింట్లోనే ఉందేది, మా అమ్మ తనకు నూనె పెట్టి జడ వేసి చాలా బాగా చూసుకునేది అంటూ చెప్పారు. తాను ఇండస్ట్రీకి రావడానికి మా నాన్ననే కారణం. అయినా ఇపుడు అసలు తన బిహేవియర్ వేరేలా ఉంది. కాంతారావు అంటే ఎవరు అనేలా ఉంది డబ్బు ఏదైనా చేస్తుంది అంటూ సుశీల అభిప్రాయపడ్డారు.



























