Actor Keshava Deepak : బాలయ్య బాబు గారి సినిమా విషయంలో జరిగింది అదే… నన్ను చూసి ఎమన్నారంటే…: నటుడు కేశవ దీపక్

0
42

Actor Keshava Deepak : బళ్లారి కి చెందిన కేశవ్ దీపక్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి 2006 లో వచ్చిన “స్టైల్” సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్లాసికల్ డాన్సర్ అయినా ఆయన డాన్స్ తో పాటు యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు. నాటక రంగం నుండి వచ్చిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆచితూచి మంచి పాత్రలను ఎంచుకుంటూ ఇపుడిప్పుడే మంచి గుర్తింపు అందుకుంటున్నారు. స్టైల్ సినిమా తరువాత పెళ్లి గోల వెబ్ సిరీస్ లో చేసిన ఆయన నిఖిల్ సిద్ధార్థ్ అంకిత్ నిక్కీ అండ్ ఫ్రెండ్స్ సినిమాలో నటించారు. ఇక విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు లో నటించిన అయన తాజాగా విజయ్ కొత్త సినిమాలో కూడ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ గారితో కథనాయకుడు సినిమాలో నటించిన ఆయన వీర సింహారెడ్డి సినిమాలో కూడ నటించారు.

బాలకృష్ణ అలా అంటారని అనుకోలేదు….

సీనియర్ నటులతో నటించినపుడు వారి గురించి బయట కొన్ని విన్నప్పుడు వారితో నటించినపుడు వాటి తాలుకు భయం, బేరుకు కొంత మందిలో ఉంటుందంటూ కేశవ దీపక్ అభిప్రాయపడ్డారు. అలా బాలకృష్ణ గారి సినిమా కథనాయకుడులో చిత్తూరు నాగయ్య పాత్రలో నటించే అవకాశం లభించినపుడు చాలా సంతోషం అనిపించినా బాలకృష్ణ కాంబినేషన్ లో సీన్స్ అన్నపుడు బయట ఆయన తిడతాడు, కొడతాడు అంటూ విన్న దానికి ఆయనతో నటించాలంటే బయమేసింది. కానీ అయన షూటింగ్ లో అసలు అలా వుండరు. నా క్యారెక్టర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అయినా ఆయన మీద చేయి వేసి మాట్లాడాలి. క్రిష్ గారు భుజం మీద చేయి వేసి ఎం వద్దు అంటూ సీన్ వివరించారు.

కానీ బాలకృష్ణ గారు ఆయన అలా చేయి వేసి చెప్తేనే బాగుంటుంది పర్వాలేదు వేయండి అని చెప్పారు. ఇక సీన్ అలానే చేసాం. అప్పుడు ఆయన ఎలా ఉంటారో అర్థమైంది. ఇక మళ్ళీ వీరసింహారెడ్డి సినిమాలో నటించినపుడు అయనతో మాట్లాడే అవకాశం లభించింది. నాటక రంగం నుండి వచ్చిన వాళ్లంటే మరింత ఆప్యాయత చూపిస్తారు. ఆడవాళ్లకు తోటి ఆరిస్ట్లకు గౌరవం ఇస్తారు ఆయన. కానీ వీరసింహరెడ్డిలో ఆయనతో ఉన్న సీన్స్ ఎడిటింగ్ లో పోయాయి. కానీ ఆయనతో మాట్లాడే అవకాశం ఒకరోజంతా ఉండే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ తెలిపారు.