Actor Madala Ravi : మాదల రంగారావు గారి అబ్బాయిగా సినిమాల్లో కనిపించిన మాదాల రవి చంద్ గారు అనగానే ‘ఎర్ర మల్లెలు’ సినిమాలో నాంపల్లి స్టేషన్ కాడి పాట గుర్తొస్తుంది. ఆ పాట ఇప్పటికీ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ పాటకు గానూ ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు రవి. ఇక తన తండ్రి సినిమాలన్నింటిలోను కనిపించిన ఆయన స్వతహాగా డాక్టర్. రష్యా లో చదువుకున్న రవి 14 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఆపైన ఇండియా వచ్చిన ఆయన తన తండ్రి ఆశయాల కోసం పనిచేస్తూ మరోవైపు సినిమా రంగంలోకి వచ్చారు. ‘నేను సైతం’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ పైన ఇలవేల్పు, బ్రోకర్ 2, పంచముఖి వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలాగే సినిమా జీవితం గురించి మాట్లాడారు.

గోపీచంద్ నా తమ్ముడు… నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూసాడు…
మాదాల రవి గారి తల్లి అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారి తల్లి సొంత అక్కాచెల్లెళ్ళు అలా గోపీచంద్ మలినేని తనకు తమ్ముడు అవుతాడని మాదాల రవి తెలిపారు. చిన్నతనంలో ఎక్కువగా గోపీచంద్ వాళ్ళ అమ్మ దగ్గరే పెరిగానని, గోపీచంద్ మా అమ్మ దగ్గర పెరిగాడు అంటూ చెప్పారు. ఇక తన మీద వచ్చిన కేసు గురించి కూడా మాదాల రవి తెలిపారు.

2014లో 30 కేసులు కలిగి ఉన్న ఒక్క రౌడీ షీటర్ మాదాల రవి మీద తప్పుడు ఆరోపణలు చేసాడు. కేసు పెట్టి పోలీసులను మిస్ లీడ్ చేసి బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నించాడు అంటూ రవి తెలిపారు. పోలీస్ వారు నోటీసు ఇవ్వకపోయినా ఆయన తన భార్యతో వెళ్లి అన్ని ఆధారాలు వారికీ కోర్టుకి ఇచ్చి అది తప్పుడు కేసు గా అదే రోజున నిరూపించుకున్నారు. అదే రోజున నాకు షరతులు లేని బెయిల్ ఇచ్చి నేను ఇంటికి వచ్చినప్పటికీ మరుసటి రోజున కొన్ని ప్రముఖ దీన పత్రికలో, వెబ్ సైట్ లో నేను జైలు కి వెళ్ళాను అని ఫేక్ న్యూస్ తో అవాస్తవాలు రాసి బాగా ఇబ్బంది కలిగించారు. తర్వాత కొన్ని నెలలలోనే కోర్టు వారికి అన్ని సాక్షాలు చూపించి కేసు గెలవటం జరిగింది. నేను ఎప్పుడూ ఎటువంటి జైలు కి వెళ్ళలేదు అంటూ ఆయన వివరించారు.