Actor Madhunandhan : తెలుగు సినిమాకు తేజ దర్శకత్వం వహించిన ‘నువ్వు నేను’ ద్వారా పరిచయమైనా మధునందన్ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసారు. రాజమౌళి దర్శకత్వంలోని ‘సై’ సినిమాలో నటించిన మధునందన్ ఆ తరువాత అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళకు తిరిగి వచ్చి సినిమా ప్రయత్నాలు చేసారు. ఇక నితిన్ ఫ్రెండ్ గా చాలా సినిమాలు చేసిన మధునందన్ మరోసారి నితిన్ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని చేయకుండా తనకు నచ్చిన పాత్రలను చేస్తూ మధునందన్ కెరీర్ లో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు.

రాజ్ తరుణ్ సుసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు…
కోవిడ్ సమయంలో అందరూ ఇబ్బందులు పడ్డారు. దీనికి పెద్ధ చిన్న అని తేడా లేకుండా అందరూ ఆర్థికంగాను, ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక హీరో రాజ్ తరుణ్ కూడా అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారట. తన కుటుంబం మొత్తం వేకెషన్ కోసం గోవా వెళ్లగా సడెన్ గా లాక్ డౌన్ పెట్టడం వల్ల వాళ్లంతా అక్కడే ఉండాల్సి వచ్చిందట. వారం అనుకున్నది కాస్త నెల పైన కావడంతో హైదరాబాద్ లో ఒక్కడే ఉండటానికి రాజ్ తరుణ్ బాగా ఇబ్బంది పడి యాక్టర్ మధునందన్ కి కాల్ చేసి నేను ఇంకో వారం ఇక్కడే ఒంటరిగా ఉంటే పిచ్చెక్కి ఆత్మహత్య చేసుకుంటానేమో భయమేస్తోంది నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు అని చెప్పాడట.

లాక్ డౌన్ సమయంలో బయట తిరిగాడానికి కూడా ఆంక్షలు ఉండేవి ఆ సమయంలో కొన్ని వెహికల్ల్స్ కి అనుమతులు ఉండేవి అలాంటి వెహికల్ ఒకటి తన స్నేహితుడికి ఉండటంతో అతని ద్వారా రాజ్ తరుణ్ ని వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడట మధునందన్. అక్కడ దాదాపు మూడు వారాలు ఉన్న రాజ్ తరుణ్, మధునందన్ అపార్ట్మెంట్ లో దాదాపు 16 మంది పిల్లలు ఉండటంతో వాళ్లతో ఆడుకోవడం వల్ల వెళ్లాలని అనిపించడం లేదు ఇంటికి అనేవాడట. మధునందన్ ఫ్యామిలీ మొత్తం ఒకే అపార్ట్మెంట్ లో ఉండి కలిసి ఉండటం వల్ల కోవిడ్ లో సమయం తెలిసేది కాదని తెలిపారు మధునందన్.