Actor Murali Mohan : వ్యాపారం నుండి నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురళీ మోహన్ గారు జగమే మాయ సినిమాతో పరిచేయమై అనతి కాలంలోనే హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడా తనదైన ముద్ర వేశారు. ఇక సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి జయభేరి బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించిన ఆయన ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించినా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా రంగంలోని అనేక విషయాల గురించి అలాగే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.

తెలంగాణ విభజన వల్ల ఆంధ్ర నష్టపోయింది…
చెన్నారెడ్డి లాంటి ఎంతో మంది నేతలు ప్రయత్నించినా రాని తెలంగాణ ఒక బక్క ప్రాణి కెసిఆర్ వల్ల సాధ్యమైంది. కెసిఆర్ పోరాటం చేసినపుడు కూడా చివరి దాకా మాకందరికీ నమ్మకం ఉండేది ఆంధ్ర తెలంగాణ విడిపోవని కానీ తెలంగాణ ఇచ్చేసారు. ఒక్కసారిగా అందరం షాక్ అయ్యాము. కానీ తెలంగాణ ఇవ్వడం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయింది.

రాజధాని లేకుండా, ఎలాంటి ఇండస్ట్రీ లేకుండా విభజిత రాష్ట్రం అప్పులతో ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ బాగా పరిపాలించారు. ముఖ్యంగా నచ్చింది ఆయన ఇరిగేషన్ పాలసీ. తెలంగాణ మెట్ట ప్రాంతం కావడం వల్ల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్లే వ్యవసాయం సాధ్యం అందుకే ఆయన మొదట లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేసారు అంటూ చెప్పారు మురళీ మోహన్.



























