Actor Nagineedu : రాజమౌళి గారి ‘మర్యాద రామన్న’ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ నాగినీడు గారు ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయనను సినిమాల్లోకి తీసుకోచ్చింది రాజమౌళి గారు కాదు అంతకుముందే వినాయక్ గారి సినిమాల్లో నటించారు నాగినీడు గారు. ఇక ఆయన మొదట అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు, ఇక సినిమాల్లో అవకాశాల గురించి ఆయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

బెల్లం కొండ గారు అవకాశం ఇచ్చారు…
ప్రసాద్ ల్యాబ్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో చాలా మంది డైరెక్టర్లతో అలాగే ప్రొడ్యూసర్లతో పరిచయాలు ఉండేవంటూ చెప్పిన నాగినీడు గారు అలా ఒక సినిమా వర్క్ కోసం వచ్చిన బెల్లం కొండ సురేష్ గారు నాగినీడు గారు మీరు నా సినిమాలో క్యారెక్టర్ చెయ్యొచ్చు కదా అని అడిగారు. సరే అనడంతో వినాయక్ గారికి అక్కడే కాల్ చేసి నాగినీడు గారికి ఒక క్యారెక్టర్ చూడమని చెప్పారు. ఆయన అన్ని క్యారెక్టర్స్ డిసైడ్ అయ్యాయి మినిస్టర్ పాత్ర చూద్దాం అన్నారు, అలా చెన్న కేశవ రెడ్డి సినిమాలో మినిస్టర్ పాత్రలో నటించాను. బాలకృష్ణ గారు నాతో చాలా చక్కగా మాట్లాడారు అంటూ చెప్పారు. ఇక అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన నాగినీడు గారు కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించారు.

ఇక రాజమౌళి గారు మర్యాద రామన్న సినిమా కోసం అడిగి గడ్డం, మీసం బాగా పెంచమన్నారు. అదే సమయంలో క్రిష్ జాగర్లమూడి ఫోన్ చేసి ఒక తమిళ సినిమాలో నా నటన చూసి అది మైండ్ లోనుండి పోవడం లేదు నా సినిమాలో మిలిటరీ మ్యాన్ పాత్రలో నటించండి అని అడిగితే గడ్డం మీసాలు పెంచాను రాజమౌళి గారు చెప్పారని ఇలా మరి అంటే నేను స్వయంగా వచ్చి మాట్లాడుతా అని చెప్పి నన్ను చూసాక గడ్డం మీసాలతో ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ మిలిటరీ వ్యక్తి పాత్రకు బాగుండరు ఈ సినిమాలో తీవ్రవాది పాత్ర ఉంది అది మీరు చేయండి అని చెప్పారట. అయితే ఉర్దూ బాగా మాట్లాడాలి అది నాకు రాదు అంటే వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు క్రిష్. అయితే అది క్రిష్ కి నచ్చక నేను మీతో డబ్బింగ్ చెప్పించుకుంటా అని చెప్పించుకున్నారు ఆ సినిమాలో నా పాత్రకు మంచి ప్రశంసలు ఉన్నాయి.
































