Actor Naresh son Naveen : నరేష్ పవిత్ర లోకేష్ మళ్ళిపెళ్లి.. ఆ నిర్ణయం వల్ల బాగా డిప్రెషన్ లోకి వెళ్ళా…తేజ ఆక్సిడెంట్ కి ముందు ఎం జరిగిందంటే…: సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్

0
57

Actor Naresh Son Naveen : సీనియర్ నటుడు నరేష్ తొంబై లలో తన కామెడీ సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. తల్లి విజయనిర్మల ద్వారా ఇండస్ట్రీ కి వచ్చిన తన నటనతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక తన పెళ్లిళ్లతో కూడ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినా నరేష్ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణంతో మరింత వార్తలకేక్కాడు. ఇక మొదటి భార్య కొడుకు నవీన్ కూడ హీరోగా ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో పరిచయం అయ్యి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో పాటు ‘అయినా నువ్వంటే ఇష్టం’ సినిమా తీసిన అది ఎపుడు వచ్చిందో పోయిందో ఎవరికీ తెలియదు. అయితే వీటన్నిటి కంటే ముందు నవీన్ ఎడిటింగ్ నేర్చుకుని కొన్ని సినిమాలకు ఎడిటింగ్ కూడ చేసాడు. ట్రైలర్స్ కట్ చేయడం, వంటివి చేస్తూ ఇండస్ట్రీ లోనే ఉన్న నవీన్ కు యాక్టింగ్ కంటే కూడ డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రస్ట్ ఉండటం వల్ల హీరోగా గుడ్ బై చెప్పి మెగా ఫోన్ పట్టుకున్నాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ తో సత్య అనే షార్ట్ ఫిల్మ్ తీసిన ఆయన ఒక ఇంటర్వ్యూ పాల్గొని తన లైఫ్ ,కెరీర్ విశేషాలను పంచుకున్నారు.

తేజ్ ఆక్సిడెంట్ అపుడు ఎం జరిగిందంటే….

సత్య అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నవీన్ తన డైరెక్షన్ చూపించడానికి వచ్చేస్తున్నాడు. ఇందులో సూర్య పాత్రలో సైనికుడి లాగ సాయి ధరమ్ తేజ్ నటిస్తుండగా భార్య పాత్రలో సత్య గా స్వాతి చాలా రోజుల తరువాత సినిమాలో కనిపిస్తోంది. ఇప్పటికే సొల్ అఫ్ సత్య అంటూ సత్య పాత్ర పరిచయంను మంచి మెలోడీ సాంగ్ తో విడుదల చేసారు. యూట్యూబ్ లో ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ రాగ ఇంటర్వ్యూ లో నవీన్ మాట్లాడుతూ ఈ షార్ట్ ఫిల్మ్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పిన నవీన్ తన ఆక్సిడెంట్ అయినపుడు అంతకు ముందు నాతోనే ఉన్నాడు . ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లి ఇద్దరం బైక్స్ మీద ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే తేజ్ కి ఆక్సిడెంట్ అని మెసేజ్ వచ్చింది. తాగి డ్రైవ్ చేసాడు అంటూ ఏవేవో మీడియాలో వచ్చేసాయి. నేను వాడు కలిసి తాగి రేస్ పెట్టుకుని అంటూ ఏవేవో రాసారు. నిజానికి సాయి ధరమ్ తేజ్ నేను అసలు తాగము. మేము బయట కలిసిన ఎక్కడైనా చాయ్ తాగి కబుర్లు చెప్పుకుంటాం. తాను కోలుకుంటే చాలు అని ఆ సమయంలో ఇలాంటి వార్తలను పట్టించుకోలేదు. నా గురించి ఏవేవో కథనాలు రాశారు. అయినా నేను వాడు ముందు లేవాలి అనుకున్నాను. అందుకే వాడు హాస్పిటల్ నుండి బయటికి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ల లేక పోయాను. ఇంట్లో ఉండిపోయాను. తనకు రికవర్ అయ్యే వరకు బయటికి రాకూడదని అనుకుని తేజ్ వల్ల అమ్మకు చెప్పి వచ్చేసాను.

అంతసేపు నాతో కబుర్లు చెప్పినవాడు అలా ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ మీద ఉంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ తెలిపారు. ఇక తన తండ్రి, పవిత్ర లొకేష్ ఇష్యూ వల్ల నేను డిప్రెషన్ లో ఉన్నానన్నది నిజం కాదు. నేను నా లైఫ్ లో డెసిషన్స్ వల్ల కొన్ని రోజులు డిప్రెషన్ లో ఉన్నాను కానీ మళ్ళీ మెడిటేషన్ వంటి వాటి ద్వారా బయటపడ్డాను. ఇక నాన్న లైఫ్ లో తన డెసిషన్స్ తన ఇష్టం, నన్ను అడిగినా నేను నీ ఇష్టం అనే చెప్తా, ఇక పవిత్ర లోకేష్ గారు చాల జెన్యూన్ వ్యక్తి ఎం జరిగిన చాలా కామ్ గా తట్టుకుంటారు అలా చాలా తక్కువ మంది ఉంటారు అంటూ చెప్పారు. ఇకపై నాన్నమ్మ కు మాటిచ్చినందుకు సినిమాల్లో నటిస్తానని అయితే డైరెక్షన్ లోనే ఎక్కువగా ఉంటానని చెప్పారు నవీన్ .