Actor Naveen : అత్తరింటికి దారేది, రామయ్య వస్తావయ్య, అల్లుడు శీను వంటి సినిమాలలో నటించిన వర్ధమాన నటుడు నవీన్. ప్రస్తుతం ఒక్క ఛాన్స్ అంటూ మంచి పాత్రలకోసం డైరెక్టర్స్ దగ్గగారికి వెళ్తున్న నవీన్ మరోవైపు వస్తోన్న అవకాశాలను వదులుకోకుండా సినిమాలను చేస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించిన విషయాలను చెబుతూనే ఇండియన్ క క్రికెటర్ విరాట్ కోహ్లీ ని కలిసినపుడు జరిగిన సంఘటనలను ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

విరాట్ కు ఆటిట్యూడ్…
ఇండియన్ క్రికెట్ టీం ఆస్ట్రేలియాతో టీ 20 మ్యాచ్ వైజాగ్ లో ఆడుతున్న సమయంలో మ్యాచ్ ముందు రోజు విరాట్ ను కలిసినపుడు నా లైఫ్ లో మర్చిపోలేను అంటు చెప్పాడు. చాలా మంది విరాట్ కు ఆటిట్యూడ్ ఎక్కువ పొగరు చూపిస్తాడు అంటూ మాట్లాడుతారు కానీ అతను అలా ఏం కాదని కలిసినపుడు అనిపించింది అంటూ చెప్పాడు నవీన్. ఇక మరుసటి రోజు ఉదయం మా అమ్మను విరాట్ కోహ్లీ కి పరిచయం చేయాలని తీసుకెళ్ళినపుడు బాగా టెన్షన్, భయపడ్డాను.

అంతకుముందు రోజు విరాట్ మ్యాచ్ లో డక్కౌట్ అయ్యాడు. నేను ఆరోజు మాట్లాడాను. ఇప్పుడు అతను ఎలాంటి మూడ్ లో ఉన్నాడో తెలియదు, వెళితే ఏమంటాడో అని భయం వేసింది. కానీ వెళ్లి అమ్మను పరిచయం చేశాను అంటూ చెప్పాడు. విరాట్ గురించి చాలా తప్పుగా బయట అనుకుంటున్నారు అనిపించింది. వాళ్లకు ప్రతి నిమిషం విలువైనదే అలాంటి ఆ సమయం మనకోసం కేటాయించడం గొప్పవిషయం కదా అనిపించింది. ఇక ప్రస్తుతం ‘బృందావనం అది అందరిది’ సినిమాలో మంచి పాత్రలో నటించాను. మరికొన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాను అంటూ నవీన్ తెలిపారు.































