Actor Pruthvi : సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను… నేను దురదృష్టవంతుణ్ణి…: యాక్టర్ పృథ్వీ

0
187

Actor Pruthvi : రుక్కు రుక్కు రుక్కుమని రమని సుగుణమని పాట అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీ. ఆ పాట వచ్చి ఎన్నేళ్లయినా ఇప్పటికీ ఆయనను పెళ్లి సినిమా పృథ్వీ గానే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో చేసినా పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమరసింహా రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. అయితే చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ గారు పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

ఆస్తులు పోడానికి కారణం ఆ సినిమాలే…

పృథ్వీ గారు పెళ్లి సినిమా తరువాత మంచి సక్సెస్ చూసారు. అలాగే మంచి రెమ్యూనరేషన్స్ కూడా అందుకున్నారు. అలా ఆ సమయంలో హైదరాబాద్ లో రెండు ఇల్లు, చెన్నై లో ఇల్లు అలాగే మలేషియా లో ఒక ఇల్లు కొన్నారట పృథ్వీ. అయితే సొంతంగా ఇల్లు నిర్మించాలనే ఆలోచనతో ప్రొడ్యూసర్ గా తాను సొంతంగా రాసుకున్న కథతో సినిమా చేయాలనుకుని సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్న సముద్రఖనితో సినిమా చేయగా అది ఫ్లాప్ అయి నష్టాలు వచ్చాయని తెలిపారు.

అలా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో మొత్తం ఆస్తులు కరిగిపోయాయని చెప్పారు పృథ్వీ. ఇక కొన్ని వ్యాపారాలను చేసి బాగా చేతులు కాల్చుకున్నానని, మలేషియా లో బాగా ఫేమస్ అయిన బబుల్ టీని ఫ్రాంచైస్ తీసుకుని నాలుగు చోట్ల పెట్టి బాగా నష్టపోయాను అంటూ చెప్పారు పృథ్వీ. అలా సినిమాల్లో సంపాదించింది అంతా అయిపోగొట్టాను నేనో దురదృష్టవంతుణ్ణి అంటూ చెప్పారు.