Actor Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.

జగన్ మీద ఆర్జీవి సినిమా దేనికి పనికి రాదు…
ఇక ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ పృథ్వీ ఈ సారి జగన్ ను ప్రజలు నమ్మరు అంటూ చెప్పాడు. పవన్ చంద్రబాబు కి వ్యతిరేకంగా జగన్ మీద సానుభూతి వచ్చేలా ఆర్జీవితో జగన్ సినిమా తీయిస్తున్నారు అనే అంశం మీద మాట్లాడుతూ జనాలు అలా ఉద్దేశ పూర్వకంగా సినిమాలను తీస్తే చూసి వాటి వల్ల ప్రభావితం అవుతారని అనుకోను అంటూ అభిప్రాయపడ్డారు.

ఈ మధ్య జనాలు కూడా సినిమాలను చూసే తీరు మారిపోయింది. ఆర్జీవి తీసే సినిమా వల్ల డైరెక్టర్ కి, నిర్మాతకి మాత్రమే లాభం. ఆ సినిమాతోనే కుప్పంలో చంద్రబాబును ఓడించేస్తాం అనడం హాస్యాస్పదం అంటూ చెప్పారు. ఇక సినిమాను వాళ్ళు చేసిన మంచి పనుల గురించి తీస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఆలా మేము ఈ పనులు చేసాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం అని చెప్పమనండి అలా తీస్తే అందులో నేనే ఒక క్యారెక్టర్ చేస్తాను డబ్బులిస్తే అంటూ చెప్పారు. 2024 లో 2019 ఎన్నికల లాగా సీట్లు గెలుస్తారు కానీ ఈసారి జగన్ కి కాదు పవన్ కి వస్తాయి అంటూ తెలిపారు. ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు జగన్ పై వ్యతిరేకత ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.