Actor Raja Chembolu : ‘కేక’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రాజా చెంబోలు. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజా చెంబోలు తేజ డైరెక్షన్ లో కేక సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న రాజా ‘ఫిదా’ సినిమాలో హీరో అన్నగా నటించాడు. హీరోగానే నటించాలనే నియమేమీ పెట్టుకోలేదంటూ చెప్పే రాజా తన సినిమా కెరీర్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తేజ నరకం చూపించాడు…
డైరెక్టర్ తేజ గురించి ఎవుడూ ఉన్న విమర్శ తనకు కావాల్సిన అవుట్ పుట్ రాకపోతే ఆర్టిస్టులను కొడతాడు. అలానే వారి మీద బాగా కోప్పడతాడు. ఇక రాజా చెంబోలు మొదటి సినిమా కేక సినిమాకు డైరెక్టర్ తేజ గారే. ఆ సినిమాలో నటించేటపుడు ఆయన వేరే ఏవో బయటి ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఆర్టిస్టులమీద చూపించేవాడు. సినిమా కమిట్ అయినందుకు పూర్తి చేశాను. సినిమా చేసేటప్పుడే అందులో ఓవర్ డ్రామా, ఎమోషన్స్ ఉన్నాయనిపించింది. అందుకే సినిమా ఫ్లాప్ అయింది.

ఆ సినిమాకు పిసి శ్రీరామ్ గారు పనిచేసారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం అదృష్టం ఎవరికి రావాలి అందుకే సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలిసినా సినిమా చేశాను అంటూ రాజా తెలిపారు. ఇక సినిమాల పరంగా ఏదైనా సలహా తీసుకోవాలంటే త్రివిక్రమ్ గారిని అడుగుతా అంటూ చెప్పారు. ఫ్యామిలీ అయినందునే అవకాశం అడగను అంటూ త్రివిక్రమ్ గారి గురించి చెప్పారు. ఇక కొన్ని సినిమాల్లో కథ నచ్చినా ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోవడం వల్ల చేయలేకపోయాను, ఊహలు గుస గుస లాడే సినిమా అలాంటిదే అంటూ చెప్పారు రాజా చెంబోలు.


































