Actor Rangasthalam Mahesh: సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడి ఒకవైపు జబర్దస్త్ చేస్తూ మరోవైపు సినిమాల్లో చిన చిన్న పాత్రలను చేస్తూ రంగస్థలం, మహానటి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్. జబర్దస్త్ మహేష్ కాస్తా రంగస్థలం మహేష్ గా గుర్తింపు తెచ్చుకుని అందరు స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ లో ముందుకు పోతున్న రంగస్థలం మహేష్ ఇటీవలే వీరూపాక్ష సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించారు. ఇక తాను ఎదుర్కొన్న కష్టాలను, చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాన్న మరణం మరచిపోలేను…
డిగ్రీ అయిపోగానే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం మొదలు పెట్టిన మహేష్ కి మొదట్లో అవకాశాలు రాలేదు. అయితే అదే సమయంలో కోకా కోలా కంపెనీ లో చిన్న ఉద్యోగంచేస్తూ సినిమాల్లో ప్రయత్నించినా ఉద్యోగం సరిగా చేయలేదని వెళ్ళిపోమనడంతో ఇక సినిమాల మీదే ఆధారపడ్డాడు మహేష్. అయితే సినిమా అవకాశాలు ఇంకా రాక ముందే తన తండ్రి మరణానికి వార్త రావడంతో ఒక్కసారిగా క్రుంగిపోయాడట.

అదీ కాక ఆ సమయంలో చేతిలో డబ్బు లేకపోవడంతో తండ్రి శవాన్ని కాల్చడానికి డబ్బు లేనపుడు ఇంకెందుకు జీవితం అనిపించింది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ఇక తండ్రి మరణించాక చాలా మంది నీ బతుక్కి సినిమాలు అవసరమా అని అన్నారు. చాలా దగ్గరి వాళ్ళే సినిమాలు అంటూ తిరగకుండా ఏదైనా ఉద్యోగం చూసుకో అంటూ క్లాస్ పీకారు అంటూ తన అనుభవాలను పంచుకున్నారు మహేష్.
































