Actor Ravi Varma : రవి వర్మ అనగానే ఎవరతను అనుకుంటారు కానీ మొగలిరేకులు సెల్వస్వామి అనగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. మొగకిరేకులు సీరియల్ తరువాత ఎన్నో సినిమాలను అలాగే సీరియల్స్ చేసినా రవి వర్మకు సెల్వ గానే మంచి గుర్తింపు ఉంది. ఇక పలు సినిమాల్లో విలన్ షేడ్ ఉన్న పాత్రలను చేసిన రవి వర్మ తెలుగు ఇండస్ట్రీలో పరభాష నటులతో సినిమాలను చేసినపుడు కోటా గారికి నచ్చదని, ఆయనతో కలిసి పనిచేసినపుడు జరిగిన గొడవ గురించి తెలిపరు.

కోటా గారికి ఇతర భాష నటులను తీసుకొస్తే నచ్చదు…
కోటా గారికి పక్కన చిన్న పాత్రలో ఒక సినిమాలో చేస్తున్న సమయంలో అప్పటికే బాగా ఫేమస్ అయిన ఉత్తరాది విలన్ ను ఆ సినిమాలో పెట్టుకున్నారు. బాగా బిజీ ఆర్టిస్ట్ గా ఆయన ఉండేవారు. అయితే డైలాగులు ముందుగా ప్రాక్టీస్ అవ్వకుండా వచ్చి సీన్ యాక్ట్ చేసేటపుడు సరిగా రాలేదు. ప్రాంప్టింగ్ పక్కన చెబుతున్నా చెప్పలేకపోయాడు. దీంతో ఎక్కువ టేకులు తీసుకున్నాడు. అప్పుడు కోటా శ్రీనివాస రావు గారికి బాగా కోపం వచ్చి పక్కన ఉన్న నన్ను పిలిచి ఆ డైలాగు చెప్పరా అని అనేసరికి నేను చెప్పాను. ఇన్ని టేకులు తీసుకునే సరికి డైలాగు వాడికే వచ్చింది నువ్వు మాత్రం చెప్పలేక పోతున్నావ్, ఎందుకు ఇలాంటి వారిని తీసుకుంటారు సినిమాలకు ఇక్కడ అంత బాగా నటించేవాళ్ళు లేరా అంటూ గొడవ చేసారు.

మళ్ళీ వారికి లక్షల లక్షలు రెమ్యూనరేషన్స్ ఇచ్చి ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేస్తారు అంటూ కోటా గారు అరిచారు అంటూ రవి వర్మ ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. డైరెక్టర్లకు దమ్ము ఉంటే ఎక్కడున్నా చిన్న ఆర్టిస్ట్ నైనా పెద్ధ విలన్ గా సినిమాలో చూపించవచ్చు కానీ వాళ్లకు అదిలేదు కనుకే పరభాష వాళ్ళ మీద ఆధారపడుతారు. ఆ పాత్రకు వాళ్ళే సరిపోతారు అనిపించినపుడు ఇతర భాష నటుడిని తెచ్చుకున్నా పర్వాలేదు కానీ డైలాగులు పలకడం కూడా రాని వాళ్ళను తెచ్చి ఇండస్ట్రీకి నష్టాలను తెస్తున్నారు అంటూ కోటా అప్పట్లో విమర్శించే వారంటూ వర్మ తెలిపారు.

































