Actor Sameer : దూరదర్శన్ లో కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్ లో నటించిన సమీర్ రుతురాగాలు, శాంతి నివాసం వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలసుబ్రమణ్యం గారు దర్శకత్వం వహించిన ‘శుభ సంకల్పం’ సినిమాలో నటించిన సమీర్ ఆ తరువాత చాలా సినిమాల్లో సహాయ నటుడుగా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా వచ్చి అలరించిన సమీర్ సినిమాల్లోనూ అటు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తున్నారు. తన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గేట్ దగ్గరే ఆపేసారు…
సమీర్ సొంతూరు వైజాగ్. అక్కడి నుండి సినిమాల్లో టీవీ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. వైజాగ్ లో ఉంటున్న సమయంలోనే రెండు సినిమాల్లో అవకాశాలు అందుకున్న సమీర్ ఆ తరువాత హైదరాబాద్ కి వచ్చేసాడు. అయితే అప్పట్లో సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల తనకు ఒక మంచి ఆఫర్ పాయిందంటూ సమీర్ చెప్పారు. అందరూ అప్పట్లో పేజర్ వాడేవారు. కానీ సమీర్ తో పేజర్ లేకపోవడంతో తన కజిన్ నెంబర్ ను కాంటాక్ట్ కోసం ఇచ్చాడు చాలా మందికి. అలా కృష్ణ రెడ్డి గారి సినిమాలో కృష్ణ గారి పక్కన నటించే అవకాశం వచ్చినా లేట్ గా విషయంలో తెలియడం వల్ల అవకాశం పోయినదంటూ చెప్పారు. ఇక శుభ సంకల్పం సినిమా విజయం తరువాత రవీంద్ర భారతి లో అవార్డు ఫంక్షన్స్ జరగడంతో నాకు తెలిసీ వెళితే అక్కడ గేటు వద్దే నన్ను ఆపేసారంతు చెప్పారు సమీర్.

నేను ఆ సినిమాలో నటించానని చెప్పినా వినలేదు, ఇక చాలా సేపు బ్రతిమాలక మొదటి గేట్ లో పంపారు లోపలికి వెళ్లాలంటే ఇంకో గేట్ దాటాలి అయితే అక్కడ ఎంత అడిగినా లోపలికి పంపలేదు. నా పేరు లోపల పిలుస్తున్నారు నాకు వినబడుతోంది, నేను చూపించడానికి నా దగ్గర ఇన్విటేషన్ లేకపోవడంతో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోలేక పోయాను అంటూ చెప్పారు. ఇక ఆ షీల్డ్ మళ్ళీ బాలు గారినే అడిగినా నాకు దక్కలేదు. ఇక ఇంద్ర సినిమా అప్పుడు ఇలానే జరిగింది. అవార్డు చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకున్నాను. అయితే వాళ్ళు మళ్ళీ ఇప్పించుకుని ఇంటికి పంపుతాం అందరివీ ఇవ్వండని తీసుకున్నారు ఇప్పటికీ రాలేదు. నేరుగా అశ్విని దత్ గారినే అడిగినా ఆయన నాది ఉంది తీసుకో అని చెబితే ఆఫీస్ కెళ్ళి చూస్తే ఆయనది కూడా లేదు. ఇక చిరంజీవి గారిని అడిగాను ఆయన నాదే లేదు నీకెక్కడ ఇవ్వను అన్నారు అంటూ చెప్పారు సమీర్.

































