Actor Sameer : పవన్ కళ్యాణ్ మీద పోస్ట్ పెట్టినందుకు నాగబాబు ఫోన్ చేసి తిట్టారు… అది తెలిసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే…: నటుడు సమీర్

0
87

Actor Sameer : దూరదర్శన్ లో కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్ లో నటించిన సమీర్ రుతురాగాలు, శాంతి నివాసం వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలసుబ్రమణ్యం గారు దర్శకత్వం వహించిన ‘శుభ సంకల్పం’ సినిమాలో నటించిన సమీర్ ఆ తరువాత చాలా సినిమాల్లో సహాయ నటుడుగా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా వచ్చి అలరించిన సమీర్ సినిమాల్లోనూ అటు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తున్నారు. తన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ తో విబేధాలు…

సమీర్ సొంతూరు వైజాగ్, అక్కడి నుండి సినిమాల్లో టీవీ రంగంలో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. వైజాగ్ లో ఉంటున్న సమయంలోనే రెండు సినిమాల్లో అవకాశాలు అందుకున్న సమీర్ ఆ తరువాత హైదరాబాద్ కి వచ్చేసాడు. ఇక ఋతురాగాలు సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సమీర్ ఆపైన సినిమాల్లోనూ సక్సెస్ అయ్యాడు. ఇక అందరు హీరోలతోనూ సరదాగా ఉండే సమీర్ మెగా ఫ్యామిలీతో గతంలో ఉన్న విబేధాల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అయితే ‘కొమరం పులి’ సినిమా మీద చాలా అంచనాలతో వెళితే సినిమా ఏమాత్రం నచ్చకపోవడంతో సినిమా చూసివచ్చాక సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ రాసాను. పవన్ కళ్యాణ్ తో ఇలాంటి సినిమానా తీసేది అంటూ రాయడంతో నాగబాబు గారు ఫోన్ చేసి తీసేయమన్నారు.

ఆ ఆర్టికల్ ఆయన చదవలేదు, వాల్ల సోదరి చూసి ఏంటి సమీర్ ఇలా రాసాడు అనే సరికి నాకు ఫోన్ చేసి ఎందుకు అలా రాసావ్, జర్నలిస్ట్ ఎపుడు అయ్యావ్ అంటూ అన్నారు. పవన్ గురించి చెడుగా రాయకపోయినా ప్రేక్షకుల మీద సినిమా ప్రభావం పడుతుందని తీసేయని చెబితే వెంటనే పోస్ట్ డిలీట్ చేసాను. ఇక సాయంత్రానికి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఏంటి సమీర్ ఏదో రాశావట అని అడిగితే నాగబాబు గారు తిట్టారు డిలీట్ చేసానని చెబుతే అలాంటివేమి పట్టించుకోను అంటూ మాట్లాడారు, ఇదే జరిగింది. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ చెప్పారు సమీర్.