బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సింధు దేశ గర్వకారణమని అభినందించారు. అనంతరం సింధును సత్కరించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను బహూకరించారు రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. శివారెడ్డి తమ ఇంటి రావడం పట్ల సింధు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తను చేసే మిమిక్రీ చాలా బాగుంటాయంటూ శివారెడ్డిని అభినందించారు.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో-2021 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం అందరికి తెలిసిందే. వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతాకాలను గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది.































