Actor Shivaji : ఏపీ రాజకీయాల్లో ఈ సారి త్రిముఖ పోటీ ఖచ్చితంగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు జగన్ మరోవైపు చంద్రబాబు ఉండగా మరోవైపు నేను ప్రభావితం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగలోకి దిగారు. నేను ముఖ్యమంత్రి అభ్యర్థినే అంటూ వారాహి వాహనంతో ప్రచారం చేస్తున్నాడు. ఈ సారి వచ్చే ఎన్నికలలో పవన్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెడతారు అంటూ చాలా మంది భావిస్తుండగా కాపు సామాజిక వర్గం దారి ఎటువైపు అనేది ఆసక్తికర అంశం. ఇక ఈ విషయం గురించి నటుడు శివాజీ తన అభిప్రాయాలను తెలిపారు.

పవన్ సీఎం కావాలంటే వ్యూహం అదే…
కాపు సామాజిక వర్గం విషయంలో మొదటి నుండి కాపు నాయకులు వ్యూహాత్మక తప్పిదం చేసారంటూ శివాజీ అభిప్రాయపడ్డారు. కాపు ప్రజలు తక్కువగా వలస వెళ్లారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గంతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఏపీలో ఎక్కువగా ఉంది, వలసలు పోలేదు. వారిని సంఘటితం చేసుకోగలిగితే కాపు సీఎంను భవిష్యత్తులో చూడగలం.

నిజానికి మెగా ఫ్యామిలీకి ఆ ఛాన్స్ ఉంది. మెగా కుటుంబంకి కాపు సామాజిక వర్గం నుండి కాకుండా మిగిలిన కులాలను వారు కూడా అభిమానులు ఉన్నారు. వారి అభిమానాన్ని ఓటుగా మార్చు కోగలిగితే ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇప్పుడు పవన్ కి ఆ ఛాన్స్ ఉంది అయితే ఆయన సామాజిక సమీకరణాలను సరిగా ఉపయోగించుకోవాలి అంటూ చెప్పారు.


































