Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీ కి కే ఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ తాజగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లోని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

బాలకృష్ణతో చేయకపోవడానికి కారణం…
అందరి హీరోలతోను స్క్రీన్ షేర్ చేసుకున్న శివాజీ ఇండస్ట్రీలో పెద్ధ హీరోలందరితోనూ నటించారు. అయితే బాలకృష్ణ తో మాత్రం నటించని శివాజీ అందుకు గల కారణాలను వివరించారు. బాలకృష్ణ గారి ఒక సినిమాలో అవకాశం వచ్చినా మళ్ళీ ఏమైందో తెలియదు ఆ క్యారెక్టర్ సాయి కుమార్ చేసారు.

ఇంత వరకు బాలకృష్ణ తో నటించకపోడానికి కారణాలంటూ ఏమి లేవు ఎందుకో మరి అవకాశం రాలేదు అంటూ చెప్పారు శివాజీ. ఇక ప్రస్తుతం పాలిటిక్స్ మీద ఫోకస్ చేసిన శివాజీ మంచి పాత్ర లభిస్తే ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తానని తెలిపారు. గత ఏడాది నుండి మళ్ళీ సినిమాల్లో చేయాలని భావిస్తున్నట్లు అయితే కొన్ని రీమేక్ కథలు ఉన్నా సొంత నిర్మాణం వద్దు అని భావిస్తున్నట్లు తెలిపారు.



























