Actor Vijaya Rangaraju : పేరు వెనుక రాజు తీసేసి చౌదరి పెట్టుకో అని సలహా ఇచ్చారు….: నటుడు విజయ రంగరాజు

0
309

Actor Vijaya Rangaraju : ఆంధ్రప్రదేశ్ కి చెందిన విలన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ రంగరాజు పలుభాషల్లో నటించినా తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు తోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. అయితే ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల పూణే లో పుట్టి అక్కడ పెరిగారు. అయితే రాయలసీమ లోని గుంతకల్లు లో చదువు పూర్తి చేసారు. ఇక నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి ఉండటం వల్ల వాటి మీద ఫోకస్ చేసారు. చెన్నై వెళ్లి దాదాపు 100 నాటకాలలో వేసారు. ఇక సినిమాల్లో ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టమంటూ చెప్పే రంగరాజు గారు తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

పేరు వెనుక చౌదరి పెట్టుకో….

విజయ రంగరాజు దాదాపు దక్షిణాదిన అన్ని భాషలలోనూ నటించారు. అయితే ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక్కో పేరుతో ఫేమస్ అయ్యారు. తెలుగులో విజయ రంగరాజు కాగా తమిళంలో రాజ్ కుమార్ అని ఇక సౌత్ శెట్టి ఇలా అన్ని పేర్లు ఉండటం వల్ల కొన్ని అవకాశాలు వదులుకున్నాను అంటూ చెప్పారు. తెలిసిన స్నేహితుడిని ద్వారా పరిచయమైన ఎన్ఆర్ఐ పేరులో రాజు తీసేసి చౌదరి అని పెట్టుకో నీకు సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పారు.

రాజు అని ఉండటం వల్ల నేనే చాలా సినిమాల్లో నిన్ను రిజెక్ట్ చేశాను. నువ్వు చౌదరి అని నాకు ఈ మధ్యనే తెలిసింది అంటూ చెప్పారట. మొదట్లో సినిమాల్లో చేసినపుడు ఎస్వి రంగారావు గారి పాత్ర చేస్తున్నందుకు రంగ అనే పేరు విజయ ప్రొడక్షన్ లో చేస్తున్నందున విజయ రంగ అని కలిపి నా పేరులో రాజ్ ను చెర్చగా అది చివరకు విజయ రంగారాజు అయింది అంటూ చెప్పారు . అయితే పేరు వెనుక చౌదరి లేక నాకు అవకాశలు పోతాయని అనుకోలేదని చెప్పారు.