Actor Vish : మెహబూబ సినిమాలో విలన్ గా నటించిన విష్, నిజానికి విష్ణు రెడ్డి 2009 లో మిస్టర్ సౌత్ పేజెంట్ విన్నర్. ఇక సినిమాల మీద ఇంట్రస్ట్ తో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో నటించాడు. సినిమా తరువాత అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ ఇంకా ఇతర విభాగాలలో పనిచేసి ఇండస్ట్రీ గురించి అవగాహన తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఇక లవ్ బ్రేక్ అప్ వల్ల మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్లి వాటిలో శిక్షణ తీసుకుని, బ్యాంకాక్ వెళ్లి ఆరు నెలలు శిక్షణ తీసుకున్న విష్, ఇప్పుడు తాజాగా లైగర్ సినిమా అవకాశంతో విజయ్ దేవరకొండకి కి ధీటుగా నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు.

పీసీ కనెక్ట్స్ లో వర్క్.. ఛార్మి ప్రపంచం అదే…
పూరి జగన్నాథ్ తో 2015 లోనే పరిచయమై ఆ తరువాత మెహబూబ సినిమా అవకాశం ఇచ్చారు విష్ కి. ఇక పూరి తో జర్నీ మొదలుపెట్టిన విష్ ఆ తరువాత పూరి కనెక్ట్స్ కంపెనీ లో సీఈఓ గా పనిచేస్తున్నారు. ప్రొడక్షన్ మొత్తం విష్ణు రెడ్డి చూసుకునేవాడు. పూరి కనెక్ట్స్ లో పూరి జగన్నాథ్, ఛార్మి, ఇద్దరు పార్టనర్స్. ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు పూరి ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. అయితే పూరి కనెక్ట్స్ లో చేరాక ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాను. అందరినీ కూర్చోబెట్టి అందరికీ ఎవరి పనులు వారికి ఉంటాయి, కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం నిజాయితీగా పనిచేద్దాం అని చెప్పాను. కానీ అందులో చాలా మందికి ఈ మాటలు ఎక్కలేదు. ఇక వినని వారికి నా స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి సెట్ చేశాను. కారు డీజీల్ ఖర్చు నుండి ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండి కొందరి నుండి చిన్న చిన్న ఖర్చులను టైట్ చేయడంతో మేము వృధా ఖర్చులను ఆపగలిగాం.

ఇక ఛార్మి, పూరి గారు ఇద్దరూ ప్రొఫెషనల్ నిర్మాతలు అవడం వల్ల నా పని సులువు అయింది. ఇక ఛార్మి ఒక పెద్ద హీరోయిన్ లాగా వ్యవహరించలేదు. ఒక మగాడిలాగా పనిచేస్తుంది. తనకు పూరి కనెక్ట్స్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. మాకన్నా వేరే ఫ్రెండ్, పార్టీలు అంటూ వెళ్తాము కానీ తనకు పూరి కనెక్ట్స్ మాత్రమే ప్రపంచం, అక్కడే పనిచేస్తూ ఉంటుంది. ఒక హీరోయిన్ హెయిర్ సరిగా సెట్ చేయకపోతే అందుబాటులో హెయిర్ డ్రెస్సెర్ లేకపోతే తానే వెళ్లి సెట్ చేస్తుంది. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర ఏదైనా సమస్య వస్తే తానే వెళ్లి చేస్తుంది. ఒక హీరోయిన్ ని, నేను అలా చేయకూడదు అని ఏ మాత్రం ఆలోచించదు.



























