Actor Vishnu : ఇట్లా మాయమాటలు చెప్పి మోసం చేయకండి బ్రో…: నటుడు విష్ణు

0
157

Actor Vishnu : సినిమా ప్రపంచం పైకి అందంగా బాగా కనిపించినా లోపల జరిగేవి వేరుగా ఉంటాయి. ఎవరికీ ఎవరు కాదు అనేలానే అవకాశం వచ్చిన వాడిది అదృష్టం అన్నట్లుగా వ్యవహారాలు ఉంటాయి. నెపో కిడ్స్ అయితే అవకాశాలు ఈజీగా వచ్చేస్థాయి. వాళ్ళు కష్టపడాల్సింది కేవలం ఆ అవకాశంను సక్సెస్ చేసుకొని నిలబడటానికే. అయితే కొత్తగా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియకుండా కేవలం టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారికి అడుగుగడుగునా కష్టాలు తప్పవు. ఒకసారి అవకాశం వస్తే చాలు నేనేంటో నిరూపించుకుంటా అన్న మాటలు పోయి ఆ ఒక్క ఛాన్స్ వచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపించే వరకు సినిమాలో ఉంటారో లేదో తెలియని, గ్యారంటీ లేని పరిస్థితులు ఉన్నాయి నేటి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇలాంటి చేదు అనుభవాలకే మోసపోయాడు ఒక వర్ధమాన నటుడు.

నన్నెందుకు మోసం చేసావ్…

తాజాగా ఒక యువ నటుడు సామాజిక మాద్యమం ద్వారా సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని పంచుకున్నారు. విష్ణు అనే ఒక వ్యక్తి ఒక సినిమాలో నటించగా ఆ సినిమాలో నీదే కీలక పాత్ర అని చెప్పి ఆ సినిమా డైరెక్టర్ అభయ్ చెప్పారని ఆ వీడియోలో తెలిపాడు. డబ్బింగ్ చెప్పిన సందర్భంలో కూడా నువ్వే మెయిన్ లీడ్ అని చెప్పి ఇప్పుడు ప్రచారం పోస్టర్ల మీద తన ఫోటో ఒకటీ లేకుండా వేసాడని ఆరోపించాడు.

వేరే ఎవరో వ్యక్తులను సినిమా పోస్టర్ మీద వేసాడని ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను మోసం చేశాడని విష్ణు ఆరోపించారు. ముందే నువ్వు మెయిన్ లీడ్ కాదు అని చెప్పుంటే ఇలా బాధపడేవాడిని కాదు నమ్మించి మోసం చేసావ్ అభి బ్రో అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు విష్ణు.