Actress Gayatri Guptha : నేను మూడు సంవత్సరాల కంటే ఎక్కువ బతకనని డాక్టర్స్ చెప్పారు… నాకున్న జబ్బు ఏంటంటే…: నటి గాయత్రీ గుప్తా

0
128

Actress Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఓపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.

డిప్రెషన్ తోనే నేటి తరానికి జబ్బులు….

గాయత్రీ గుప్తా ఇండస్ట్రీ కి వచ్చి 15 సంవత్సరాలు అయినా ఇప్పటికి తాను చేసిన సినిమాలు కేవలం 20 మాత్రమే అంటూ చెప్పారు. జనాలకు గుర్తుండేలా ఒక్క సినిమాలో నటించిన అది సక్సెసే అంటూ చెప్పే ఆమె తాను చాలా ఏళ్ళుగా ఆటో ఇమ్మ్యూన్ వ్యాధి వల్ల బాధపడుతున్నట్లు తెలిపారు. చాలా మంది డాక్టర్స్ ఆయుర్వేదం, హోమియో ఇలా చాలా మంది తాను మూడేళ్ళ కంటే ఎక్కువ బతకనని చెప్పారు.

కానీ చివరికి ‘ట్రూమా హీలింగ్’ ద్వారా నాకు తెలిసిన విషయం నా డిప్రెషన్ వల్లే నాకు జబ్బు వచ్చింది అని. నా డిప్రెషన్ తగ్గితే నా జబ్బు తగ్గుతుంది. తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో నేను చాలా బాధపడ్డాను ఇపుడిపుడే ట్రూమా హీలింగ్ వల్ల కొంతమంది కోలుకుంటున్నాను అంటూ చెప్పారు. చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లలతో సమయం కేటాయించి వారికి ప్రేమ అందిస్తేనే ఇలాంటి డిప్రెషన్ వంటివి ఇవి దరి చేరవు. నేటి తరాలను చూస్తే భయం వేస్తుంది. పేరెంట్స్ ఇద్దరు పని చేస్తుండటం వల్ల సెల్ ఫోన్ వాడకం పెరగడం వల్ల పిల్లలలో ఇప్ప్పటికే డిప్రెషన్ ఎక్కువవుతోంది వారికి ఇంకా ఎక్కువ విచిత్రమైన జబ్బులు వస్తాయి అంటూ చెప్పారు.