Actress Jayalalitha : బోరింగు పాప అనగానే టక్కున గుర్తొచ్చే నటి జయలలిత. తాజాగా జీ తెలుగులో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ ‘ప్రేమ ఎంత మధురం’లో హీరో ఆర్యవర్ధన్ తల్లిగా హుందగా కనిపించే పాత్రలో ఆదరగొడుతున్న జయలలిత గారు అటు సినిమాలు చేస్తూనే ఇటు సీరియల్స్ లో కనిపిస్తున్నారు. ఎక్కువగా వాంప్ తరహా పాత్రలను చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న జయలలిత ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అంటూ చెప్పారు.

చచ్చిపోతా అని చివరికి చిత్రవధ చేసాడు…
జయలలిత తెలుగు, కన్నడ, తమిళంతో పాటు మలయాళంలోనూ ఎక్కువ సినిమాలను చేసారు. అందునా మలయాళంలో చాలా సినిమాలలో నటించిన ఆమె ఒక డైరెక్టర్ తో దాదాపు 25 సినిమాలను చేశారట. ఆ సమయలోనే ఆ డైరెక్టర్ తో పరిచయం ప్రేమగా మారి ఇదేళ్లు ప్రేమించుకున్నారట. ఇంట్లో వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీలో వాళ్లకు అతడిని పరిచయం చేస్తే వద్దు దొంగ కోళ్లు పట్టేవాడిలాగా ఉన్నాడు ఆలోచించుకో అని చెప్పారట. అయితే ఆ డైరెక్టర్ మాత్రం పెళ్లి చేసుకోక పోతే చచ్చిపోతాను అంటూ మాట్లాడటంతో అతడిది నిజమైన ప్రేమ అనుకుని కొచ్చిన్ లో పెళ్లి చేసుకున్నారట.

జయలలిత కుటుంబంలో వారికి ఆమె పెళ్లి ఇష్టం లేక అయిష్టంగానే పెళ్ళికి వచ్చారట. అయితే పెళ్లి సమయంలోనే ఆమె పవర్ ఆఫ్ అటర్నీ ని తల్లిదండ్రులు రాయించుకుని జయలలితకు పిల్లలు పుట్టాక ఇస్తామని చెప్పారట. అతడి బాగోతం కొన్నాళ్ళకు నీకే తెలుస్తుందని పెళ్లి సమయంలో కూడా హెచ్చరించారట. అనుకున్నట్లుగానే పెళ్ళైన కొన్ని రోజులకు పవర్ ఆఫ్ అటర్నీ తన తల్లిదండ్రులకు రాసిచ్చినట్లు తెలియగానే వేధించడం మొదలు పెట్టాడట. నాకు తెలియకుండా ఎలా చేసావ్ అంటూ తిట్టేవాడట. నటులు చలపతి రావు, గిరిబాబు వంటివారి సహాయంతో అతని ఇంటి నుండి బయటికి రాగలిగానని చెప్పారు అయితే అతను అంత వేధిస్తున్నా చనిపోవాలని ఎపుడూ అనుకోలేదని చెప్పారు జయలలిత.
































