Actress Kalpika Ganeshan : హైదరాబాద్ లో పుట్టిన అయ్యంగర్ కుటుంబానికి చెందిన అమ్మాయి కల్పిక గణేశన్. చదువుయ్యాక మొదట మోడలింగ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కల్పిక ఆ తరువాత చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా తరువాత సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీత ఆన్ రోడ్ వంటి పలు సినిమాల్లో నటించింది. ఇక అటు కొన్ని వెబ్ సిరీస్ లలోనూ నటించిన కల్పిక తాజాగా తమిళంలో మెయిన్ లీడ్ గా ‘పెరోల్’ అనే సినిమాలో నటించింది. తమిళంలో ఈ సినిమాకు మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఇక కల్పిక సోషల్మీ డియాలో చాలా అబ్యూస్ ను ఎదుర్కొంటోంది. ఇంస్టాగ్రామ్ దీనికి సంబంధించిన స్టోరీస్ పెడుతుండగా ఇటీవల జరిగిన ఒక ఇష్యూతో మరీ ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతున్నాను అంటూ తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలుగా పెడుతున్నారు…
ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో గెస్ట్ గా వెళ్లిన కల్పిక అక్కడ జారిగిన చేదు అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మొదలైన రచ్చ ఆమెను అబ్యూస్ చేస్తూ బూతులు మాట్లాడుతూ పోస్ట్లు పెడుతున్నారు. వాట్సాప్, ఇంస్టాగ్రామ్ కాకుండా పర్సనల్ మెసేజెస్ తో ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది నా ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలుగా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేస్తున్నారు. అలా చేస్తే వారికి ఏమొస్తుందో నాకు అర్థం కావడలేదు.

డబ్బులోస్తాయా లేక పేరొస్తుందా ఇలాంటివి చేస్తే అంటూ మాట్లాడింది కల్పిక. ఇక తనకు జరిగిన ఇలాంటి అబ్యూస్, మార్ఫింగ్ ఇవన్నీ ఏ సెలబ్రిటీకైనా జరగొచ్చు. అందుకే ఇలాంటి వారిమీద స్పందించమని అందరినీ అడుగుతున్నా ఇంకా స్పందన తక్కువగా ఉంది. యాంకర్ రష్మీ గౌతమ్ ని కూడా ఈ విషయంలో స్పందించమని యాక్టర్ నందు ద్వారా అడిగాను కానీ తాను బిజీగా ఉండటం వల్లో లేక ఇంకేం కారణాలతోనో స్పందించలేదు అంటూ తాను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా అబ్యూస్ గురించి చెప్పింది.

































