Actress Kanishka Soni: కనిష్క సోనీ ఎన్నో బాలీవుడ్ సీరియల్స్ లో నటించి టీవీ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా నుదుటిన సింధూరం దిద్దిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ విధంగా ఈమె నుదిటిపై సింధూరం పెట్టుకున్న ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు చూసిన అభిమానులు అసలు ఈమె ఎవరిని పెళ్లి చేసుకుందనీ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈమె తనని తానే పెళ్లి చేసుకుందని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు కంగుతిన్నారు.ఇప్పటివరకు తాను మాటమీద నిలబడే మగాడిని చూడలేదని అందుకే వారిపై నమ్మకం లేక తనని తానే పెళ్లి చేసుకున్నానని తెలిపారు.
మగాడు జీవితంలో తాను ఎంతో ధైర్యంగా బ్రతకగలనని ఈమె ధీమా వ్యక్తం చేసింది.నా కాళ్ళపై బ్రతికే ధైర్యం నాకుంది ఒకరి అండదండలు నాకు అవసరం లేదని చెప్పడమే కాకుండా, సె**కూడా మగాడు లేకుండా చేయవచ్చు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. సైన్స్ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో శృంగారంలో పాల్గొనడానికి మగాడు అవసరం లేదని తేల్చి చెప్పింది.

Actress Kanishka Soni: తనని తానే పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన నటి..
ఈ విధంగా తనను తాను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇలా శృంగారం గురించి కూడా బోల్డ్ కామెంట్ చేయడంతో ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు తనపై తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఒక మగాడు జీవితంలో అండగా లేకుండా తాను బ్రతకగలనని కనిష్క ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తుంది.






























