Actress Namitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా సొంతం, జెమిని, బిల్లా, సింహ వంటి సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నమిత గురించి అందరికీ తెలిసిందే.2017 వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమిత త్వరలోనే తల్లిగా మారబోతున్నారు. ఇప్పటికే ఈమె తన పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు. అప్పటి నుంచి తరచూ తన బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆమె తన సీమంతపు వేడుకలను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

తాజాగా నమిత తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ నిర్వహించారు ఈ క్రమంలోనే తన బేబీ బంప్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కమింగ్ సూన్ అంటూ వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఈ తొమ్మిది నెలల గర్భిణీ కావడంతోనే కొద్దిరోజులలో నమిత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోట్ అవుతారని తెలుస్తోంది.
కొద్ది రోజులలో బిడ్డకు జన్మనివ్వనున్న నమిత…
ఇకపోతే ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. నమిత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి ఆదరణ పొందారు. ప్రస్తుతం వెండితెరకు పూర్తిగా దూరమై తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.
View this post on Instagram





























