Actress Pramila Rani : మంచు విష్ణు కి ఓటు వేస్తే 6000 ఇస్తామని చెప్పారు… కానీ ఓటు వేసాక ఏం చేసారంటే…: నటి ప్రమీల రాణి

0
115

Actress Pramila Rani : దాదాపు 85కు పైగా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకున్న నటి ప్రమీల గారు. బాహుబలి బామ్మ గా మంచి గుర్తింపు అందుకున్న ప్రమీల గారు మొదట వద్దు బావ తప్పు, రియల్ పోలీస్, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు, వేదం, బాహుబలి, విక్రమార్కుడు, వంటి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా వేదం, బాహుబలి సినిమాల్లో గుర్తింపు అందుకున్న ఆమె తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

మంచు విష్ణుకి అందుకే ఓటు వేసా…

మా అధ్యక్ష ఎన్నికలు ఇది వరకూ జరిగినట్లు కాకుండా సాధారణ ఎలక్షన్ తలపిస్తూ క్రితం ఎన్నికలు జరిగాయి. విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పోటా పోటీగా సాగిన ఎన్నికలలో విష్ణు ప్యానెల్ గెలిచింది. ఇక ఎన్నికలలో నటి ప్రమీల రాణి మంచు విష్ణు గారికే ఓటు వేశారట. దానికి కారణం చెబుతూ విష్ణు కి ఓటు వేస్తే గెలిచాక ఏజ్ అయిన వాళ్లకు 6000 రూపాయలు డబ్బులిస్తామని చెప్పారు.

అదీ కాక మన వ్యక్తిని వదిలి పక్క రాష్ట్ర నటుడికి ఓటు ఎందుకు వేయాలని అనిపించింది. అయితే విష్ణు గెలిచాక 6000 రూపాయలు ఇస్తే ఇక సినిమాల్లో నటించరాదు అని చెప్పారు. వాళ్లిచ్చే డబ్బు కోసం పని వదులుకోవాలా అని డబ్బు తీసుకోలేదు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఇచ్చారు అంటూ చెప్పారు ప్రమీల.