Actress Prema: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా కనడ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరు సరసన నటించిన ఈమె తెలుగులో ధర్మ చక్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా పలు సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేమ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఏదైనా మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఈమె తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాలు గురించి తెలియజేశారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె జీవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల సమయంలో తాను చాలా స్ట్రాంగ్ అయ్యానని ప్రేమ తెలియచేశారు.విడాకుల తర్వాత తాను కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని అయితే ఆ సమయంలో తను ఆస్ట్రేలియాలో ఉండగా చాలా మంది నాకు క్యాన్సర్ అని పుకార్లు సృష్టించారని తెలిపారు.
విడాకులు తీసుకున్న తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం మాత్రమే… పెళ్లి జీవితం కాదని ఈమె తెలిపారు. తనకు సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె రెండో పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…