‘బిగ్ బాస్ తెలుగు 5’ టాప్-7 లిస్ట్ లో చోటు దక్కించుకున్న కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ . ఆమె 13వ వారంలో బయటకు వచ్చారు. తర్వాత టాప్ 6 మెంబర్స్ లో కాజల్ 14వ వారం హౌజ్ నుంచి బయటకు వచ్చారు.

ఇక ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో మొత్తం టాప్ లో ఉన్నవాళ్లు సిరి, సన్నీ, మానస్, షణ్ముఖ్ మరయు శ్రీరామచంద్ర. వీళ్లల్లో ఒకరు డిసెంబర్ 19న టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక ఇదిలా ఉండగా.. 19 మంది కంటెస్టెంట్లలో ఒకరైన నటి ప్రియాకు.. ప్రియాంక సింగ్ కు హౌజ్ లో మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరు ఎక్కువగా ఒకరికొకరు టైం స్పెండ్ చేస్తూ కనిపించారు.
అయితే తాజాగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆమెకు ప్రియా ఓ ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చారు. అది చూసిన ప్రియాంక ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఎంతో ఖరీదైన డైమండ్ రింగ్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క (నటి ప్రియా) ఇచ్చిన బహుమతిని తెరిచి చూడగానే షాక్ అయ్యాననని.. అది తాను అస్సలు ఊహించలేదని.. అందులో డైమండ్ రింగ్ ఉంటుందని అస్సలు అనుకోలేదని చెప్పి.. థ్యాంక్యూ అక్కా.. ఐ లవ్ యూ అంటూ చెప్పి.. ఆ ఫొటో ను పోస్ట్ చేసింది.
ఇక ఎన్నో సందర్భాల్లో పింకి ఇలా మాట్లాడింది.. ప్రియాక్కలో అమ్మను చూసుకున్నా అని.. ఆమె మనస్సు ఎంతో స్వచ్ఛమైనది అని చెప్పుకొచ్చింది. బావగారు దుబాయ్ నుంచి అక్క కోసం తెచ్చిన రింగ్ ను నాకోసం ఇచ్చారని.. రింగ్ కంటే గొప్పది మా అక్క ప్రియా అంటూ చెప్పింది.





























