నటి రేణు దేశాయ్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా ?

0
144

రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య. రేణుదేశాయ్ సినిమాల్లోకి రాకముందు ఓ మోడల్ గా పని చేసారు. ఆవిడ మోడల్ రంగం నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత రేణు దేశాయ్ కూడా కేర్ పక్కన పెట్టేసి తనకి ప్రేమ ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయే వరకు కూడా పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ ఫ్యాషన్ డిజైనర్గా ఉంటూ అన్ని ఆవిడే చూసుకునేది.

పిల్లలు అకీరా, ఆద్య కూడా రేణు దేశాయ్ వద్దనే ఉంటున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లోనే ఉంటున్నారు రేణు దేశాయ్. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు కూడా ఉంది. అయితే పవన్ తో విడాకులు తీసుకున్న సమయంలో ఈమెకు భరణం కింద భారీ మొత్తంలో డబ్బులు ముట్టాయనే వార్తా ఎప్పటినుంచో ఉంది. అయితే అదంతా అవాస్తవం అని.. విడాకుల సమయంలో పవన్ తనకు ఏం ఇవ్వలేదని మీడియా ముఖంగానే తెలిపింది రేణు. అయితే పిల్లల కోసం తండ్రిగా చేయాల్సినవి అన్నీ పవన్ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.

అయితే ఈ సమయంలో రేణు దేశాయ్ ఆస్తుల గురించి నేట్టింట ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తో పాటూ.. ఈ మధ్య బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంన్న రేణు దేశాయ్ కి జూబ్లీ హిల్స్‌లో ఖరీదైన ఇల్లు, మూడు కార్లు కూడా ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అదేవిధంగా పూణేలోనూ కూడాకొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. ఇక అన్నీ కలిపితే రేణు దేశాయ్ ఆస్తులు సుమారుగా 40 కోట్ల వరకు ఉంటాయని ఉంటాయనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here