Actress Sadha: జయం సినిమాతో వెళ్ళవయ్య వెళ్ళు అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు సదా.ఈ సినిమాలో లంగా వోణీలో అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో అమాయకంగా నటించి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా జయం సినిమాతో అద్భుతమైన విజయం తన ఖాతాలో వేసుకున్న సదా అనంతరం పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు.
ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి ఒకానొక సమయంలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే సదా వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా కార్యక్రమాలతో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె మొదటిసారిగా డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టారు.
హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సదా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమెకు పెళ్లి గురించి ప్రశ్నలు రావడంతో ఈ వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు పెళ్లి బంధం పై పెద్దగా నమ్మకం లేదని తెలిపారు.మన కెరియర్ లో మనం నిలదొక్కుకోకుండా పెళ్లి చేసుకొని ఇతరులపై ఆధారపడటం తనకు ఇష్టం లేదని ఈ సందర్భంగా సదా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వివాహం చేసుకున్నవారు ప్రశాంతంగా లేరని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.పదిమంది పెళ్లి చేసుకుంటే ఇందులో 5 మంది మాత్రమే వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారని మిగతా ఐదు మంది ఏదో ఒక కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతున్నారంటూ ఈమె తెలిపారు.ఇలా విడాకులు తీసుకుని విడిపోవడం గురించి సదా మాట్లాడడంతో ఈమె పరోక్షంగా సమంత నాగచైతన్యలను ఉదాహరణగా తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ విధంగా ఈమె పెళ్లి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో సదా మాట్లాడిన మాటలు నిజమే కదా అంటూ కొందరు ఈమెకు మద్దతు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…