Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాలో బెనర్జీ వైఫ్ గా క్యారెక్టర్ చేసి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ అన్ని విశేషాలను పంచుకున్నారు.

కూతురుని అత్తింటి వారు చిత్రహింసలు పెట్టారు…
సన గారు ఇప్పటికీ కొన్ని వందల సినిమాల్లో పలు భాషలలో నటించారు. అయితే తన కుటుంబం నుండి తన పిల్లలు మాత్రం యాక్టింగ్ వైపు అడుగుపెట్టలేదు. ఇక కొడుకు అన్వర్ భార్య బుల్లితెర యాంకర్ అలాగే సీరియల్ నటి సమీరా. వారిద్దరిదీ ప్రేమ వివాహం కావడం విశేషం. ఇక సన కూతురికి మంచి సినిమా అవకాశాలు వచ్చినా తనకి ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి లేకపోవడం వల్ల తాను ఇటు వైపు రాలేదట. తాను సంప్రదాయ బద్ధంగా పెరిగిందని నమాజ్ చేస్తూ, ఎపుడు చదువుతూ అలా పెరిగిన అమ్మాయి కావడం వల్ల సినిమాల వైపు రావాలని అనుకోలేదట.

ఇక చదువుయ్యాక పెళ్లి చేయగా మొదట్లో అంతా బాగానే అనిపించినా తన అత్తింటి వారి వేధింపుల వల్ల డివోర్స్ ఇచ్చేసింది. నిజానికి తన కూతురు అసలు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా పుట్టింట్లో ఒక్క మాట కూడా చెప్పలేదట. దుబాయిలో సన కుటుంబానికి చూపించిన ఇల్లు కాకుండా వేరే చోట పెట్టి తన వద్ద ఉన్న బంగారం, డబ్బు అంతా లాక్కున్నా కూడా పుట్టింట్లో చెప్పకుండా భరిస్తూ వచ్చిందట. ఇక చివరికి సన గారే విషయాలు తెలుసుకుని కూతురిని తీసుకువచ్చి హైదరాబాద్ పోలీసుల సహాయంతో వాళ్ళను అరెస్టు చేయించారట. ప్రస్తుతం కూతురు తన బిడ్డను చూసుకుంటూ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తోందంటూ సన చెప్పారు.



























